ఇటీవల ‘గరుడవేగ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో రాజశేఖర్ తన తల్లిని తల్చుకుని ఎంత ఎమోషనల్ అయ్యాడో తెలిసిందే. వేదిక మీదే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు రాజశేఖర్. తన తల్లితో రాజశేఖర్ కు ఎలాంటి అనుబంధం ఉందో అప్పుడే అందరికీ అర్థమైంది. తాజాగా ‘గరుడవేగ’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన రాజశేఖర్ తన తల్లి గురించి మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తన అజాగ్రత్త వల్లే తల్లి ప్రాణాలు కోల్పోయిందని.. తాను తప్పు చేశానని అన్నాడు రాజశేఖర్.
‘‘నేను వైద్యుడిని కాబట్టి మా అమ్మానాన్నల్ని వందేళ్లు బతికించుకోవాలని అనుకునేవాడిని. కానీ మా అమ్మను 82 ఏళ్లకే పోగొట్టుకున్నా. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. అమ్మ అనారోగ్యానికి కొన్ని మందులు వాడుతుండేది. దానికి నేను ఆల్టర్నేట్స్ చెబుతుండేవాడిని. ఒకసారి అమ్మకు సీరియస్ అయితే నేనే మందులిచ్చా. అవి వాడగానే తగ్గిపోయింది. కానీ రెండు రోజుల తర్వాత మళ్లీ అనారోగ్యం పాలైంది. నేనిచ్చిన మందులు ఎందుకు వాడవు అని ఆమెతో వాదించాను. కానీ మందులు వేయలేదు. నా మాటలు వింటూనే అమ్మ ప్రాణాలు కోల్పోయింది. అమ్మకి సీరియస్ అయిన వెంటనే ఆలస్యం చేయకుండా టాబ్లెట్ వేయకుండా కాలయాపన చేశానా.. అమ్మను పోగొట్టుకున్నానా అన్న ఫీలింగ్ నన్ను వెంటాడుతోంది. మా అమ్మకు పాటలంటే చాలా ఇష్టం. మా అమ్మాయిలిద్దరూ చెరో పక్క చేరి పాటలు పాడుతుంటే వినేది. ఓసారి నేనూ ఓ పాట పాడా. ఎంత బాగా పాడుతున్నావ్ బంగారం.. అని మెచ్చుకొంది. అలాంటి అమ్మ ఇప్పుడు ఇంట్లో లేకపోవడం చాలా వెలితిగా అనిపిస్తోంది’’ అని రాజశేఖర్ ఆవేదన వ్యక్తం చేశాడు.