నేను.. చిరంజీవి కలవకూడదా-రాజశేఖర్

Update: 2017-11-07 07:44 GMT
తాను ఇటీవల జీవితతో కలిసి చిరంజీవిని కలవడంపై మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు హీరో రాజశేఖర్. తాను చిరంజీవిని కలవడం వల్లే ‘గరుడవేగ’ బాగా ఆడుతోందని కూడా ఓ టీవీ ఛానెల్లో పేర్కొన్నట్లు రాజశేఖర్ చెప్పాడు. ‘గరుడవేగ’ విషయంలో చిరంజీవి తనకు గొప్ప సపోర్ట్ ఇచ్చారని రాజశేఖర్ తెలిపాడు.

‘‘చిరంజీవి గారు మా సినిమా గురించి విడుదలకు ముందు మంచి మాటలు చెప్పడమే కాదు.. విడుదల తర్వాత సినిమా చూశారు. మమ్మల్ని ఫోన్ చేసి అభినందించారు. ఇంటికి బొకే కూడా పంపించారు. ఆయన మా పట్ల చాలా కేరింగ్ గా ఉన్నారు. అందుకు ఆయనకు చాలా చాలా థ్యాంక్స్. ఐతే మేం వెళ్లి ఆయన్ని ఇంట్లో కలిసినపుడు మీడియా వాళ్లు రకరకాలుగా రాశారు. రాజశేఖర్ కు ఇప్పటికి బుద్ధి వచ్చింది. అందుకే వెళ్లి చిరంజీవిని కలిశాడు. కాబట్టే సినిమా ఆడుతోందని అన్నారు.

ఐతే చిరంజీవి గారితో గతంలో మాకు కొన్ని విభేదాలు వచ్చిన మాట వాస్తవం. కానీ అది ఎప్పుడో జరిగింది. ఆ తర్వాత మేం కలిసిపోయాం. అపార్థాలన్నీ తొలగిపోయాయి. కొన్ని ఫంక్షన్లకు కలిసి వెళ్లాం కూడా. అయినా మేం ఆయన్ని కలిస్తే తప్పేంటి? మేం కలవకూడదా? దయచేసి మీడియా వాళ్లు మా మధ్య గొడవలు పెట్టకండి. అలాగే చిరంజీవి గారితో పాటు బాలకృష్ణ గారు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయనకు కూడా నా థ్యాంక్స్’’ అని రాజశేఖర్ ‘గరుడవేగ’ సక్సెస్ మీట్‌ లో అన్నాడు.
Tags:    

Similar News