తెలుగు బుల్లి తెరపైనే కాకుండా, సినిమా ఇండస్ట్రీలో కూడా తనదైన ముద్ర వేసిన ప్రముఖ యాంకర్ సుమ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగామె కాకున్నా, ఒక మలయాళి అయినా కూడా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతూ స్టార్ హీరోల సినిమాల వేడుకలకు హోస్ట్ గా చేస్తున్న సుమ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఆమె పారితోషికం గురించి కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై తాజాగా ఆమె భర్త రాజీవ్ కనకాల స్పందించాడు.
ఇంటర్వ్యూలో సుమ పారితోషికం మరియు ఇతర విషయాల గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ఆమె ప్రతిభ పనితనమే ఆమెకు ఈ స్థానంను కల్పించాయి. ఆమె సక్సెస్ లో, ఆమె స్థానంలో నేను ఏమాత్రం క్రెడిట్ తీసుకోను. మా అమ్మ నాన్న లక్ష్మీదేవి కనకాల మరియు దేవదాస్ కనకాల గార్ల కోడలు అయినందుకు ఆమెకు మొదట్లో కాస్త కలిసి వచ్చి ఉండవచ్చు. కాని ఇప్పుడు ఈ స్థాయికి పూర్తిగా ఆమె కష్టపడే తత్వం కారణం. సుమకు పెద్ద ఎత్తున లక్షల్లో పారితోషికం ఉంటుందని, హీరోయిన్స్ కంటే కూడా అధికంగా సుమ పారితోషికం ఉంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ వార్తలు నిజం కాదని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చాడు.
సుమ పారితోషికం విషయం పక్కన పెడితే ఆమె పడే కష్టం మామూలుది కాదు. సినిమాల్లో నటించే వారు కొన్ని నిమిషాల పాటు లైట్ల వెలుతురులో ఉండి నటిస్తారు. కాని సుమ మాత్రం కొన్ని గంటల పాటు లైట్ల వేడి మద్య వెలుతురు మద్య ఉండాల్సి ఉంటుంది. ఆమె పెద్ద పెద్ద సౌండ్స్ మద్య కూడా గంటలతరబడి ఉంటుంది. ఆ పెయిన్ భరించడం మామూలుగా సాధ్యం కాదు. కాని సుమ వాటన్నింటిని భరించి కష్టపడుతోంది. సుమ లక్షల్లో పారితోషికం తీసుకుంటుందని అంటారు. ఆమె ఎన్ని లక్షలు పారితోషికం తీసుకుంటుందో నాకైతే తెలియదు. సుమ ఎంత సంపాదిస్తుందనే విషయాన్ని నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం కూడా నేను ఎప్పుడు చేయలేదు, ఇతరుల సంపాదన పెత్తనం చేయాలనుకునే మనస్థత్వం నాది కాదని అన్నాడు.