గ్యారేజిలో ఆ సీన్ కే అందరి ప్రశంసలు!

Update: 2016-09-02 10:13 GMT
సెప్టెంబరు 1 - గురువారం భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా "జనతా గ్యారేజ్". ఈ సినిమాపై మొదలైనప్పటినుంచీ భారీ అంచనాలే ఉన్నాయి.. అయితే విడుదల అయిన తర్వాత మాత్రం కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సూపరా, యావరేజా అనే టాపిక్ కాసేపు పక్కనపెడితే.. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణలు చాలానే ఉన్నాయి. అయితే ఆ అన్ని ఆకర్షణల్లోనూ ఈ సినిమాలోని ఒక ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా ఇప్పటికే చూసినవారు కూడా ఈ ఎపిసోడ్ పైనే చర్చించుకుంటున్నారంటే.. ఈ ఎపీసోడ్ స్థాయేమిటో అర్ధమవుతుంది.

ఈ సినిమాలో రాజీవ్ కనకాల పాత్ర నేపథ్యంలో వచ్చే ఒక ఎపిసోడ్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అంటే అతిశయోక్తి కాదు. అవినీతిపరులకు అండగా ఉండటం కంటే, వారికి తలవంచి తప్పుడు పనికి అనుమతి ఇవ్వడంకంటే.. చనిపోవడమే కరెక్ట్ అనే సిన్సియర్ ఆఫీసర్ పాత్ర చేసిన్ రాజీవ్ కనకాల.. ఒక సాయం కోసం జనతా గ్యారేజ్ కు వస్తాడు. అతడు వెనక్కి వెళ్లిపోయినా తిరిగి పిలిపించి.. అతడికి అండగా నిలుస్తానని చెప్తాడు ఎన్టీఆర్. ఈ క్రమంలో రాజీవ్ కనకాల ఇంటివద్ద నుంచి మొదలై జీహెచ్ ఎంసీ కార్యాలయంలో జరిగే ఫైట్ వరకూ ఉన్న 20 నిమిషాల ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అయ్యింది. ఈ సన్నివేశంలో ఎన్టీఆర్ నటన - కొరటాల శివ డైలాగులు అద్భుతమనే చెప్పాలి.

ఎన్టీఆర్ ఎంత మంచి నటుడో - డైలాగ్ డెలివరీలో అతనికున్న టేలెంట్ ఏమితో, కొరటాల మాటలకున్న పదునెంతో ఈ సన్నివేశంలో తెలుస్తుంది. ఈ సన్నివేశంలో ప్రేక్షకులు కళ్లు - చెవులు పూర్తిగా తెరపైనే కేంద్రీకరించారని చెప్పినా అతిశయోక్తి కాదు. తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ సీన్స్ లో ఒకటిగా దీన్ని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఇలాంటి సన్నివేశాలే మరో రెండు మూడు పడి ఉంటే.. "జనతా గ్యారేజ్" రేంజే వేరుగా ఉండేది అనేది సాదారణ ప్రేక్షకుడి అభిప్రాయం. ఏది ఏమైనా.. ఈ ఎపీసోడ్ మాత్రం "జనతా గ్యారేజ్" ని నిలబెట్టిందనే చెప్పాలి.
Tags:    

Similar News