సౌత్ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలకు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల ఫ్యాన్స్ భారీగా ఉంటారు. తెలుగు అభిమానులతో పోల్చితే తమిళ హీరోల అభిమారులు కొన్ని సార్లు విచక్షణ కోల్పోయి మరీ ప్రవర్తిస్తూ ఉంటారు. తమిళనాట అజిత్, విజయ్, రజినీకాంత్ అభిమానుల మద్య ఎప్పటికి గొడవ నడుస్తూనే ఉంటుంది. అలాంటి ఫ్యాన్స్ మద్య ఒక్క చోట వందల సంఖ్యలో చేరితే ఏమైనా ఉందా, అనుకున్నట్లుగానే ఇరు వర్గాల ఫ్యాన్స్ మద్య బీభత్సమైన పోరు జరిగింది. థియేటర్లు రణరంగమైనాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ మరియు అజిత్ ‘విశ్వాసం’ చిత్రాలు సంక్రాంతి కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా పాజిటివ్ టాక్ ను దక్కించుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఆడుతున్న మల్టీ ప్లెక్స్ మరియు పక్క పక్కన థియేటర్ల వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడినది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రెండు వర్గాల వారు ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారు.
రెండు సినిమాలు విడుదలైన పలు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వేలూరులోని ఓ థియేటర్ ముందు ఇరు వర్గాల అభిమానులు కత్తులతో - కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో దాదాపు అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారని, పదిమంది పాక్షికంగా గాయాలపాలయ్యారని తమిళ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కత్తులతో దాడి నేపథ్యంలో వెలూరు మొత్తం టెన్షన్ వాతావరణం నెలకొంది. స్టార్ హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే పరిస్థితి ఏంటో అక్కడి వారికి తెలిసి వచ్చింది. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ హీరోలదే.
Full View