సూపర్ స్టార్ రజినీకాంత్ వారం కిందట తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసి వరద బాధితుల్ని ఆదుకునేందుకు రూ.10 లక్షల చెక్కును చేతిలో పెట్టిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. మన తెలుగు స్టార్ అల్లు అర్జునే పాతిక లక్షలిస్తుంటే రజినీకాంత్ తన సొంత రాష్ట్రానికి కేవలం పది లక్షలివ్వడమేంటి అని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కమల్ హాసన్ ప్రభుత్వానికి తానెందుకు విరాళం ఇవ్వాలని ప్రశ్నించారు. మొత్తానికి తమిళ పరిశ్రమకు రెండు కళ్లలాంటి నటులు వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది.
ఐతే తాజా సమాచారం ఏంటంటే వరద బాధితుల కోసం రజినీకాంత్ ఏకంగా రూ.10 కోట్ల విరాళం అందజేశారట. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రచురించింది. ఐతే రజినీ నేరుగా ఆ విరాళాన్ని అందజేశారా లేక.. ఆ మొత్తానికి మరో మార్గంలో సాయం చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. రజినీ మామూలుగానే తన ఆదాయంలో సగ భాగాన్ని ఛారిటీకి ఉపయోగిస్తారని.. కోట్లాది రూపాయల పనులు చేస్తారని సన్నిహితులు అంటారు. ఐతే దాని గురించి ప్రచారం చేసుకోవడం ఇష్టం లేక బయటికి చెప్పడంటారు. మరి వరద బాధితుల విషయంలోనూ అలాగే చేస్తున్నారేమో చూడాలి. అదే నిజమైతే ముఖ్యమంత్రిని కలిసి ఆ పది లక్షల చెక్కు ఎందుకిచ్చినట్లో?