కమల్ తో చాలా జాగ్రత్తగా ఉంటా -రజినీ

Update: 2017-04-06 04:58 GMT
రజినీకాంత్- కమల్ హాసన్ ల మధ్య అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ ఇద్దరు దిగ్గజ నటులు సుదీర్ఘ కాలంగా సినిమా రంగాన్ని ఏలుతుండడమే కాదు.. ఎంతో ఆప్యాయంగా కూడా ఉంటారు. అయితే.. కమల్ తో చాలా జాగ్రత్తగా ఉంటానని చెప్పారు ఆశ్చర్యపరిచారు రజినీ.

తాజాగా కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్ దివంగుతులైన సంగతి తెలిసిందే. చెన్నె కామరాజ్ అరంగంలో జరిగిన ఆయన వర్ధంతి కార్యక్రమంలో కమల్ తో పాటు.. రజినీకాంత్ కూడా పాల్గొన్నారు. 'నేను చంద్రహాసన్ నిజాయితీ గురించి చాలానే విన్నాను. నిజానికి ఇవాల్టి తరం నటులతో పోల్చితే నా స్నేహితుడు కమల్ దగ్గర చాలా తక్కువ డబ్బులే ఉంటాయి. అతని దగ్గరున్న ప్రతీ రూపాయి చారుహాసన్ ఇచ్చినదే. కమల్ హాసన్ లాంటి షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తి నేను నా జీవితంలో చూడలేదు. మీరు ఆయనలో 10 శాతం కోపాన్ని చూసి ఉంటారు. నేను 100 శాతం కోపం కూడా చూశాను. అందుకే తనతో డీల్ చేసేటపుడు చాలా జాగ్రత్తగా ఉంటాను' అన్నారు సౌత్ సూపర్ స్టార్.

'కమల్ కోపాన్ని తగ్గించేందుకు చంద్రహాసన్ ప్రయత్నిస్తూ ఉంటారు. బాలచందర్.. అనంత్.. చారు హాసన్.. చంద్ర హాసన్ లు.. కమల్ జీవితంలో అంతర్గత భాగం. వారిలో ముగ్గురు ఇప్పుడు ఈ లోకంలో లేరు. ఈ పరిస్థితి నా ఫ్రెండ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో అని భయంగా ఉంది. కానీ మేం నీతో ఎల్లపుడూ ఉంటాం కమల్. చంద్రహాసన్ ఆత్మ శాంతి కోసం ప్రార్ధిస్తున్నాను' అన్నారు రజినీకాంత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News