ఓసారి రజినీకాంత్ హిమాలయ యాత్ర చేస్తుండగా, అలసిపోయి రోడ్డు పక్కన కూర్చుంటే ఓ ఫారిన్ లేడీ ఎవరో ఆయన్ని భిక్షగాడు అనుకుని డబ్బులు వేసి వెళ్లిందట. నిజ జీవితంలో అలా ఉంటుంది రజినీకాంత్ అవతారం. రజినీ రంగు ఎలా ఉంటుందో తెలిసిందే. జుట్టు పోయింది ఉన్న జుట్టు - గడ్డం అంతా తెలుపు. మనిషేమైనా ఆజానుబాహుడా అంటే ఏం కాదు. చూడ్డానికి అంత ఫిట్ గా కూడా ఏమీ అనిపించడు. ఇలాంటి ఫీచర్స్ ఉన్నవాడు సూపర్ స్టార్ ఏంటి అంటే.. అదంతే మరి. తెరమీద ఆయన్ని చూస్తే ఎవ్వరికైనా మైకం కమ్మేయాల్సిందే. తొలిసారి తన సినిమా చూసిన వాడిని కూడా ఇట్టే ఆకర్షించేయగల సమ్మోహనాస్త్రం రజినీ దగ్గరుంది. ఆ స్క్రీన్ ప్రెజెన్స్ - ఆ స్టయిల్ అలాంటిది మరి.
రజినీ తెరమీద వెలిగిపోవడంలో మేకప్ ది కీలక పాత్ర. ఏమాత్రం అసహజంగా అనిపించకుండా అద్భుతమైన మేకప్ తో రజినీని సరికొత్తగా చూపించడం ఆయన మేకప్ మెన్ లకే చెల్లింది. మొన్న ‘లింగ’ సినిమాలో, అంతకుముందు రోబో, శివాజీ సినిమాల్లో రజినీని ఎంత బాగా చూపించారో తెలిసిందే. తాజాగా ‘కబాలి’ సినిమా కోసం రజినీ మరో మెస్మరైజింగ్ లుక్ లో కనిపిస్తున్నాడు. వయసుకు తగ్గ పాత్ర పోషిస్తూ.. తెల్ల జుట్టులో కూడా తన ప్రత్యేకత చూపిస్తున్నాడు రజినీ. ఈ సినిమా లుక్స్ ఇప్పటికే చాలానే బయటికి వచ్చాయి. అందులో ఆయన మేకప్ - స్టైలింగ్ అన్నీ కూడా సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. ఈ లుక్సే సినిమా మీద అంచనాలు పెంచేశాయి. అభిమానులు లుక్స్ చూసి పట్టరాని ఆనందంతో ఊగిపోతున్నారు. ఇక సినిమాలో రజినీ ఇంకెంతగా ఉర్రూతలూగిస్తాడో చూడాలి మరి.