పైరసీ దెబ్బ సినిమా ఇండస్ట్రీకి గట్టిగానే తగులుతోంది. గత కొన్ని వారాల్లో చిన్నా పెద్ద సినిమాలు ఇండస్ట్రీలతో తేడా లేకుండా పైరసీకి గురవుతున్నాయి. సినిమా విడుదలకు ముందే నెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఇప్పటికే ఉడ్తాపంజాబ్ - సుల్తాన్ - గ్రేట్ గ్రాండ్ మస్తీలు ఆన్ లైన్ లీకుల కారణంగా నష్టపోగా.. ఇప్పుడు సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన క్రేజీ మూవీ కబాలి కూడా ఆన్ లైన్ లో లీక్ అయిందన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
జూలై 22న విడుదల కావాల్సిన కబాలి చిత్రం ఇప్పటికే ఆన్ లైన్ లో పలు లింక్స్ లో డౌన్ లోడ్ కు అందుబాటులో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాతలు కూడా స్పందించారు. 'ఆన్ లైన్ లింక్స్ ను తొలగించాల్సిందింగా అధికారులను కోరాం' అంటున్నారు. ఈ లీక్ కి మరింతగా ప్రచారం జరగకుండా ఉండేందుకే అధికారిక ప్రకటన చేయడం లేదని తెలుస్తోంది. కబాలి లీక్ పై సెన్సార్ బోర్డ్ కూడా స్పందించింది. 'కబాలి చిత్రాన్ని చెన్నైలోనే సెన్సార్ చేశారు. దీనికి ముంబై ఆఫీసుతో ఎటువంటి సంబంధం లేదు. అయినా ఇలాంటి పెద్ద స్టార్ల సినిమాలకు లీకేజీలతో నష్టం ఉండకపోవచ్చు అనుకుంటున్నా' అంటూ సెన్సార్ బోర్డ్ చీఫ్ పంకజ్ నిహ్లానీ కామెంట్ చేయడంతో.. ఈ లీక్ వార్తలు నిజమే అని అర్ధమవుతోంది.
అయితే లీకైన కబాలి సినిమాను మామూలు ఇంటర్నెట్ నెట్వర్క్ ద్వారా చూడటం కాని డౌనులోడ్ చేయడం కాని కుదరట. కేవలం డార్క్ వెబ్ అనే ప్రక్రియ ద్వారా ప్రత్యేక యాప్స్ ద్వారా చూడ్డానికి మాత్రమే వీలుపడుతుందట. అందువలన.. కామన్ మ్యాన్ కు ఈ ప్రింటు చేరేలోపు సైబర్ క్రయిమ్ వారు దీనిని తొలగించడానికి చాలా స్కోప్ ఉంది.