తెలుగులో పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ల సినిమాలు రిలీజవుతున్నపుడు ఉండే క్రేజే వేరు. వాళ్ల సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా మొదలవడం ఆలస్యం.. అలా టికెట్లు అయిపోతాయి. కొన్ని నిమిషాల్లోనూ టికెట్లు ‘సోల్డ్ ఔట్’ అన్న మెసేజ్ వచ్చేస్తుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘కబాలి’ విషయంలోనూ అదే జరుగుతోంది. నిన్న సాయంత్రం కబాలి తెలుగు వెర్షన్ బుకింగ్స్ మొదలయ్యాయి. కానీ టికెట్లు అందుబాటులో ఉంచిన కొన్ని నిమిషాలకే అదృశ్యం అయిపోయాయి. చాలా వరకు షోలకు ‘సోల్డ్ ఔట్’ మెసేజ్ కనిపిస్తుంటే. కొన్ని థియేటర్లలో ‘ఆల్ మోస్ట్ ఫుల్’ అని చూపిస్తోంది. బుకింగ్ కోసం ట్రై చేస్తే ఎక్కడో స్క్రీన్ ముందు కొన్ని ఖాళీలు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో తొలి రోజు అన్ని షోలకూ దాదాపుగా టికెట్లు అయిపోయాయి. సింగిల్ స్క్రీన్లలో కూడా కొన్ని టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తెలుగులో కూడా కొందరు స్టార్ హీరోలకు మాత్రమే ఇంత క్రేజ్ కనిపిస్తుంది. రజినీ గత సినిమాలన్నింటికంటే కూడా ‘కబాలి’ మీద ఎక్కువ క్రేజ్ ఉండటం.. పైగా వాయిదాల మీద వాయిదాలు పడి సినిమా ఎట్టకేలకు విడుదలవుతుండటంతో జనాలు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సినిమా చూడాలని తహతహలాడుతున్నారు. ఇంతకుముందు శివాజీ.. రోబో సినిమాల విషయంలోనూ మాంచి క్రేజ్ కనిపించింది. ‘కబాలి’ విషయంలో అంతకుమించి హైప్ కనిపిస్తోంది.