నిజానికి యుట్యూబ్ రికార్డుల వలన పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఏదో సినిమా టీజర్ లేదా ట్రైలర్ కు ఈ ఆన్ లైన్ వీడియో షేరింగ్ వెబ్సైట్ లో అన్నేసి హిట్లు వచ్చాయంటే.. దానికి ఒక క్రేజ్ తప్పిస్తే.. ఈ క్లిక్కుల కారణంగా సినిమా బీభత్సమైన హిట్టేం అవ్వదు. కాకపోతే ఇప్పుడు మహేష్ బాబు ''బ్రహ్మోత్సవం'' ట్రైలర్ వచ్చేసింది అనగానే.. ''కబాలి'' టీజర్ లెక్కలు ఏమన్నా షేకవుతాయా అని ఫ్యాన్సంతా ఆత్రంగా ఎదురు చూశారట. కాని ఇక్కడ అంత సీన్ కనిపించట్లేదు.
కేవలం ఇప్పటివరకు 'మహేష్ బాబు' అండ్ 'పివిపి సినిమా' ఛానల్స్ లో కలిపి.. బ్రహ్మోత్సవం అఫీషియల్ ట్రైలర్ కు 1.8 మిలియన్ (18 లక్షల హిట్స్) వ్యూస్ మాత్రమే వచ్చాయి. ఇక ''కబాలి'' సినిమా తమిళ టీజర్ కు ఇప్పటికే 16 మిలియన్ (1.6 కోట్లు హిట్స్) వ్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. లాంగ్ రన్ లో కూడా బ్రహ్మోత్సవం వ్యూస్ మన కబాలి వ్యూస్ ను టచ్ చేయడం కష్టమే. బహుశా రజినీకాంత్ కు ఉన్న ప్యాన్ ఇండియన్ క్రేజ్ అండ్ వరల్డ్ వైడ్ అభిమానం.. అన్నేసి వ్యూస్ రావడానికి దోహద పడుంటాయి.
అదే లేండి.. ఇప్పుడు అమెరికాలో కలక్షన్లు తేవడంలో.. మహేష్ బాబు తరువాత ఎవరైనా. అలాగే ఇలాంటి యుట్యూబ్ రికార్డులో రజనీకాంత్ తరువాతే అనుకోవాలి. ఒక్కో డొమైన్ లో ఒక్కొక్కరు స్ర్టాంగ్ గా ఉంటారు.