సూపర్ స్టార్ సినిమా మెజారిటీ భాగం ముంబైలోనే!

Update: 2019-03-10 12:54 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' తర్వాత ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు ప్రస్తుతం జోరుగా ప్రీప్రొడక్షన్ జరుగుతోంది.  ఈ నెలాఖరులో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారనే ప్రచారం సాగుతోంది.  ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో కోలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా కథ ముంబై నేపథ్యంలో సాగుతుందట.  రజనీ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని.. గవర్నమెంట్ వ్యవస్థలోని లొసుగులను వాడుకొని మోసాలు చేసేవారిపై పోరాటం చేస్తాడని అంటున్నారు .   కథ ప్రకారం మెజారిటీ షూటింగ్ ముంబైలోనే జరిపేందుకు మురుగదాస్ టీమ్ సన్నాహాలు చేసుకుంటున్నారట.  ముంబై నేపథ్యం ఉన్న సినిమాలలో నటించడం రజనీకి ఇదేం మొదటి సారి కాదు అప్పట్లో 'బాషా' రీసెంట్ గా 'కాలా' చిత్రాలు ముంబై నేపథ్యంలో తెరకెక్కినవే.  మరోవైపు మురుగదాస్ కూడా విజయ్  'కత్తి'.. సూర్య 'గజని' సినిమాలను ముంబై నేపథ్యంలో తెరకెక్కించాడు.

అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడు. సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్.  హీరోయిన్ల పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ నయనతార..  కీర్తి సురేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.  రజనీ-మురుగదాస్ కాంబినేషన్ మొదటిసారి కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Tags:    

Similar News