రజనీకాంత్ డైరక్షన్ చేసి కిక్ ఇచ్చాడు

Update: 2016-12-15 11:30 GMT
మామూలుగా చాలామంది సినిమా ఫ్యామిలీస్ అందరూ కూడా.. తమ ఫ్యామిలీ హీరోలతోనూ హీరోయిన్లతోనూ ముహూర్తం షాట్ల నుండి సినిమా ఓపెనింగ్ వరకు అన్నీ కానిచ్చేస్తున్నారు. ఇప్పడు సూపర్ స్టార్ రజీనీకాంత్ ఫ్యామిలీ కూడా అలాగే అయిపోయారులే.

ఇప్పటికే హీరో ధనుష్‌ ఒక కథను రాసి.. తన మరదలు సౌందర్య రజనీకాంత్ చేతిలో పెట్టాడు. ఆమె డైరక్షన్లో ఇప్పుడు ఆ కథను ''విఐపి 2'' సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మొదటి వర్షన్ తెలుగులో కూడా రఘువరన్ బిటెక్ అంటూ విడదలై సంచలనం సృష్టించింది. అయితే ఈ వేలు ఇల్లయ్ పట్టదారి సినిమాను ఈరోజు లాంచింగ్ చేశారు. తన కూతురును బ్లెస్ చేయడానికి ముహూర్తం షాట్ కు దర్శకత్వం వహించాడు సూపర్ స్టార్ రజినీ. అల్లుడు హీరోగా.. కూతురు డైరక్టరుగా.. తనేమో గౌరవ దర్శకత్వం.. వావ్ అదుర్స్ అంటే అదుర్స్ కదూ.

ఇకపోతే మొన్ననే 2.0 షూటింగ్లో రజనీ గాయపడ్డాడని.. బెడ్ రెస్ట్ అనీ.. హాస్సిటల్లోనే కొన్నాళ్లు.. అంటూ రూమర్లు రావడంతో అసలు రజనీ ఎలా ఉన్నారో అని అభిమానులు అంతా కంగారుపడ్డారు. కాని ఇప్పుడు ఆయన ఇలా పబ్లిక్ ఎప్పీయరెన్స్ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారులే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News