సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నెల్సన్ దిలీప్ గత చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్న కారణంగా ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా జైలర్ ఉంటుందేమో చూడాలి.
ఇదే సమయంలో రజినీకాంత్ తదుపరి సినిమా గురించి కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసిన విషయం తెల్సిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. కూతురు దర్శకత్వంలో సినిమా చేసిన స్టార్ హీరోగా నిలిచి అరుదైన ఘనత దక్కించుకున్నాడు. ఇప్పుడు మరో కూతురుకి అవకాశం ఇవ్వబోతున్నాడు.
గతంలో సౌందర్య కు అవకాశం ఇచ్చిన రజినీకాంత్ ఈసారి ఐశ్వర్య కి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఐశ్వర్య కూడా దర్శకురాలిగా ఇప్పటికే అనుభవం దక్కించుకుంది. కనుక ఆమె తో ఒక సినిమా ను చేయడం ద్వారా ఈ కూతురు కు కూడా న్యాయం చేయాలి అనుకుంటున్నాడా అంటూ తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
రజినీకాంత్ ఈ మధ్య కాలంలో మంచి కథలు ఎంపిక చేసుకోవడంలో విఫలం అవుతున్నాడు. కనుక ఈ సినిమా విషయంలో కూడా ఆయన నిర్ణయం సరైనది కాకపోవచ్చు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కూతురు కు నిర్మాతగా అవకాశం ఇస్తే పర్వాలేదు కానీ ఆమె దర్శకత్వంలో సినిమాను చేయాలి అనుకోవడం సరైన నిర్ణయం కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు చాలా సంవత్సరాలుగా బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని దక్కించుకోలేక పోతున్నాయి. జైలర్ సినిమా అయినా సక్సెస్ అవుతుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.