థియేటర్ల యాజమాన్యంకు రజినీ హెచ్చరిక

Update: 2018-11-19 16:48 GMT
తమిళ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘2.ఓ’ చిత్రం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈనెల 29న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలకు సిద్దం అయ్యింది. తమిళం - తెలుగు - హిందీ భాషలతో ఓవర్సీస్‌ లో కూడా భారీ ఎత్తున విడుదలకు రెడీ అయ్యింది. ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో మొదటి రోజు మొదటి షో చూడాలని అభిమానులు ఉవ్విల్లూరుతున్నారు. మొదటి రోజు మొత్తం కూడా టికెట్లకు అత్యధిక డిమాండ్‌ ఉంది. దాంతో కొందరు అభిమానులు ఆ డిమాండ్‌ ను క్యాష్‌ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అభిమానులకు కొన్ని ప్రత్యేకమైన టికెట్లను ఇవ్వడం జరుగుతుంది. ఆ టికెట్లను అభిమానులు బ్లాక్‌ లో అమ్ముతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. 200 రూపాయల టికెట్‌ ను బ్లాక్‌ లో రెండు - మూడు వేల రూపాయలకు అమ్ముతున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. థియేటర్ల యాజమాన్యం కూడా బ్లాక్‌ లో వెయ్యి నుండి రెండు వేల వరకు అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయనే వార్త మీడియాలో వస్తున్న నేపథ్యంలో రజినీకాంత్‌ స్వయంగా స్పందించాడు.

అభిమానులను మరియు థియేటర్ల యాజమాన్యాలను ఉద్దేశించి టికెట్లను బ్లాక్‌ లో అమ్మినట్లుగా తేలితే కఠిన చర్యలు తప్పవని - అసలు ధర కంటే రూపాయి కూడా థియేటర్ల యాజమాన్యాలను రజినీకాంత్‌ హెచ్చరించాడు. మరి రజినీకాంత్‌ హెచ్చరికను వారు ఏ మేరకు ఖాతరు చేస్తారో చూడాలి. శంకర్‌ విజువల్‌ వండర్‌ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన నేపథ్యంలో థియేటర్‌ లోనే ఈ చిత్రాన్ని చూడాలని ఎంతో మంది ఆశపడుతున్నారు. అందుకే టికెట్లు దొరక్కుండా ఉన్నాయి.

Tags:    

Similar News