వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అవి విడుదలకాకపోవడమో, విడుదలైనా పెద్దగా విజయాలు సాధించకపోవడంతో కమల్ కెరీర్ కాస్త స్లో గా సాగుతుంది. తన డ్రీమ్ ప్రాజెక్టు కి సీక్వెల్ విశ్వరూపం 2, ఇంకా ల్యాబ్ లోనే మోక్షం కోసం ఎదురుచూస్తుంది. ఈ మధ్య కమల్ ఎక్సయిట్ అయ్యి ఒప్పుకున్న స్క్రిప్ట్ శభాష్ నాయుడు శరవేగంగా సాగుతుందని అనుకున్నా అనుకోకుండా కమల్ గాయంతో ఆ షూటింగ్ ఆగిపోయింది.
తన ఆఫీస్ రూమ్ నుండి మెట్లు దిగుతూ జారిపడ్డ కమల్ కాలికి శస్త్రచికిత్స అవసరమని హుటాహుటున ఆపరేషన్ చేసి మూడునాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అన్న వైద్యులు ఇప్పుడు మాట మారుస్తున్నారు.
తన కాలిగాయం తిరగబెట్టిందంటూ మరోసారి కాలికి శస్త్రచికిత్స చేసినట్టు సమాచారం. అయితే అభిమానులను ఆందోళన పడవద్దని, తాను త్వరలో కోలుకుంటానని తెలిపారు. కమల్ ఆరోగ్య వ్యవహారాల గురించి సూపర్ స్టార్ రజినీ ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం.