‘బాహుబలి: ది కంక్లూజన్’ తర్వాత దేశమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా ‘2.0’. ఏస్ డైరెక్టర్ శంకర్- సూపర్ స్టార్ రజినీకాంత్ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ఈ అంచనాలకు తగ్గట్లే సినిమా ఉంటుందన్న సంకేతాలిచ్చేలా కొన్నాళ్ల కిందట ఒక మేకింగ్ వీడియో వదిలాడు శంకర్. అందులోని విన్యాసాలకు జనాల దిమ్మదిరిగింది. ఇప్పుడు మరో ప్రమోషనల్ వీడియోను రెడీ చేసి పెట్టాడు శంకర్. ‘2.0’ పూర్తిగా త్రీడీలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశంలోని వేలాది థియేటర్లను ఈ సినిమా కోసమే త్రీడీ హంగులతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తోంది చిత్ర నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్’.
‘2.0’తో దేశంలోని థియేటర్లలో ఒక త్రీడీ విప్లవం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఐతే ఈ త్రీడీ మేకింగ్ అనేది అంత సులువైన విషయం కాదు. దానికి ఎంతో అవగాహన ఉండాలి. మరెంతో శ్రమించాలి. ఆ శ్రమ ఎలాంటిదో.. తమ సినిమా ప్రత్యేకత ఏంటో చూపించేలా ‘2.0’ త్రీడీ మేకింగ్ వీడియోను సిద్ధం చేశాడు శంకర్. ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ వీడియో లాంచ్ చేయబోతున్నట్లు ట్విట్టర్లో వెల్లడించాడు శంకర్. ఈ వీడియోతో ‘2.0’పై అంచనాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. ‘2.0’ పోస్ట్ ప్రొడక్షన్ ముగింపు దశలో ఉండగా.. వచ్చే మూడు నెలలూ ప్రమోషన్లతో హోరెత్తించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ నెలలోనే ‘2.0’ టీజర్ రిలీజవుతుంది. వచ్చే నెలలో ఆడియో వేడుక చేస్తారు. డిసెంబర్లో ట్రైలర్ వస్తుంది. 2015 జనవరి 27న ‘2.0’ ప్రేక్షకుల ముందుకొస్తుంది.