భారతదేశమంతా ఎదురుచూస్తున్న మరో బాహుబలి రేంజ్ సినిమా అంటే ఖచ్చితంగా అది సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న 2 పాయింట్ ఓ సినిమా అనే చెప్పాలి. ఈ 2.0 కోసం ఆల్రెడీ దర్శకుడు శంకర్ బాగా కష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు సినిమాకు కావల్సిన క్రేజును ఆడియో ఫంక్షన్ తో డబుల్ చేయాలని చూస్తున్నాడు.
మరో రెండు రోజుల్లో.. 27న 2.0 ఆడియో ఫంక్షన్ మిడిల్ ఈస్ట్ రిచ్ సిటీ దుబాయ్ లో గ్రాండుగా జరగబోతోంది. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహ్మాన్ స్వయంగా సంగీతవిభావరి చేస్తున్నాడు. లైవ్ లో ఆ పాటలను వాయించి వినిపిస్తాడట. అయితే ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి దాదాపు 12 కోట్లు ఖర్చవుతోంది. అక్కడకు వచ్చే అతిథులు కోసం ఒక్క టేబుల్ విత్ స్నాక్స్ ఏర్పాటు చేయడానికే ఏకంగా 6 లక్షలు అవుతోందట. ఈ వేడుక తాలూకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలియజేస్తే లైకా వారు కొన్ని ఫోటోలు విడుదల చేశారు.
అంతేకాదు.. ఫోటోలను చూపిస్తూ.. ఇప్పుడు ఆ నగరం పేరు దుబాయ్ అయినప్పటికీ.. మరో రెండు రోజుల్లో సూపర్ స్టార్ ఎపెక్టుతో ఆ నగరం 2.0 నగరంగా మారిపోతుంది అంటున్నారు. మొత్తానికి కబాలి కోసం మలేషియాను ఎక్సయిట్ చేసిన రజనీ.. ఇప్పుడు 2.0 కోసం దుబాయ్ ను సెలక్ట్ చేసుకున్నారు. అది సంగతి.