ఇండియాలో ఇప్పటిదాకా విజువల్ ఎఫెక్ట్స్ కోసం అత్యధికంగా ఖర్చు చేసిన సినిమా ‘బాహుబలి’. ది బిగినింగ్.. ది కంక్లూజన్.. రెండు సినిమాలకూ కలిపి రూ.100 కోట్ల దాకా ఖర్చు చేసినట్లు అంచనా. ఐతే ‘బాహుబలి’ని కొట్టే సినిమా అవుతుందని అంచనా వేస్తున్న ‘2.0’ సినిమాకు ఒక్క దానికే విజువల్ ఎఫెక్ట్స్ కోసం రూ.100 కోట్ల దాకా ఖర్చయిందట. ముందు అంచనా రూ.80 కోట్లు కాగా.. పనంతా పూర్తయ్యేసరికి ఖర్చు రూ.100 కోట్లకు చేరుతున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఏమాత్రం రాజీ అన్నదే లేకుండా ప్రపంచంలోని ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ సహకారంతో ఈ చిత్రానికి ఎఫెక్ట్స్ చేయిస్తున్నాడట శంకర్.
రికార్డు స్థాయిలో రూ.450 కోట్ల ఖర్చుతో ‘2.0’ను తెరకెక్కిస్తున్నాడు శంకర్. గ్రాఫిక్స్.. వీఎఫెక్స్ విషయంలో ఇండియన్ సినిమాకే పాఠాలు నేర్పించిన్ శంకర్ కు ‘బాహుబలి’తో రాజమౌళి సవాలు విసిరాడు. ఈ సవాలును ప్రతిష్టాత్మకంగా తీసుుకుని ‘2.0’ను రూపొందిస్తున్నాడు శంకర్. ఇప్పటికే ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 25న ‘2.0’ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ నెల 27న దుబాయిలో భారీ ఎత్తున ఆడియో వేడుక చేయబోతున్నారు. వచ్చే నెలలో హైదరాబాద్ వేదికగా టీజర్ లాంచ్ చేస్తారు. ఆపై డిసెంబర్లో చెన్నైలో థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఉంటుంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.