సౌత్ ఇండియన్ సినిమాలో భారతీరాజాది ప్రత్యేకమైన ప్రస్థానం. ఆయన సినిమాలు వర్ధమాన దర్శకులకు ఒక పాఠం. ‘సీతాకోక చిలుక’తో పాటు ఎన్నో క్లాసిక్స్ ఆయన నుంచి వచ్చాయి. ఈ దర్శకుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ను మంచి నటుడిగా ఎప్పుడూ గుర్తించలేదట. రజినీని నటన పరంగా ఒక్కసారి కూడా ప్రశంసించలేదట. గత 40 ఏళ్లలో రజినీతో భారతీరాజా కేవలం రెండుసార్లు మాత్రమే మాట్లాడాడట. ఈ విషయాన్ని స్వయంగా రజినీనే వెల్లడించాడు. ‘భారతీరాజా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ సినిమా’తో ఈ లెజెండరీ డైరెక్టర్ తాజాగా చెన్నైలో ఒక ఫిలిం స్కూల్ ఆరంభించారు. ఈ స్కూల్ రజినీ చేతుల మీదుగా ఆరంభమైంది.
ఈ సందర్భంగా భారతీ రాజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రజినీ. తనను భారతీరాజా ఎప్పుడూ మంచి నటుడిగా గుర్తించలేదని.. తనను మంచి మనిషి అని మాత్రమే అనేవారని రజినీ అన్నాడు. ఈ 40 ఏళ్లలో భారతీ రాజా తనతో రెండుసార్లు మాత్రమే తనతో మాట్లాడాడని.. అందులో ఒక సందర్భం ‘16 వయదినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) సినిమాలో నటించేందుకు కాల్ షీట్ అడగడం కోసం అయితే.. రెండో సందర్భంగా తన ఇన్ స్టిట్యూట్ ప్రారంభోత్సవానికి పిలవడం కోసమని రజినీ చెప్పాడు. భారతీరాజా ఫిలిం ఇన్ స్టిట్యూట్ వర్ధమాన నటీనటులు.. దర్శకులకు చక్కటి వేదిక అని రజినీ అభిప్రాయపడ్డారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చన్నాడు. అనంతరం భారతీరాజా మాట్లాడుతూ రజినీ కష్టపడి గొప్ప స్థాయికి ఎదిగాడని కితాబిచ్చాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/