ఒకే ఫ్రేమ్ లో ర‌జ‌నీకాంత్- షారూక్- విజ‌య్

Update: 2022-10-08 04:34 GMT
ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు దిగ్గజ హీరోలు అందంగా ఒదిగిపోయారు. ఇందులో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ - కింగ్ ఖాన్ షారూక్ - ద‌ళ‌ప‌తి విజ‌య్ ఒక‌రితో ఒక‌రు ఎంతో ఉత్సాహంగా ఆనందంగా క‌నిపించ‌డంతో అభిమానుల‌కు అది క‌న్నుల‌పండుగ‌ను త‌ల‌పించింది.

షారుఖ్ ఖాన్ భారతీయ సినిమా లెజెండ్ గా సుప్ర‌సిద్ధుడు. దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే- కుచ్ కుచ్ హోతా హై- చెన్నై ఎక్స్‌ప్రెస్- ఓం శాంతి ఓం- దిల్ సే స‌హా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలలో న‌టించాడు. నిర్మాత‌గా ఎన్నో చిత్రాల‌ను నిర్మించారు. భారతదేశంలోని వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ద‌ర్శ‌క‌నిర్మాతలు ఆయనను గౌరవిస్తారు. ప్ర‌స్తుతం అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా మూవీలో న‌టిస్తున్నాడు. తాజాగా చెన్నైలో జవాన్ షెడ్యూల్ ను ముగించడంతో కింగ్ ఖాన్ కి కోలీవుడ్ చలనచిత్ర సోదరుల నుండి గొప్ప ఆతిథ్యం లభించింది.

సూప‌ర్ స్టార్ రజనీకాంత్- ద‌ళ‌ప‌తి విజయ్ వంటి ప్రముఖులు కింగ్ ఖాన్ ను సెట్లో అభినందించారు. జవాన్ సెట్స్ లో తలైవర్ రజనీకాంత్ అదరగొట్టారు. రజనీకాంత్ తదుపరి చిత్రం జైలర్ సెట్ షారూక్ న‌టిస్తున్న సెట్ కి చాలా స‌మీపంలోనే ఉంది. దాంతో ఆయ‌న షారూక్ ని క‌ల‌వ‌డం సులువైంది. ఆ ఇద్ద‌రూ చాలా సేపు సెట్స్ లో మంత‌నాలు సాగించారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇప్ప‌టికే ప‌లుమార్లు షారూక్ ని సెట్లో క‌లిసి మాట్లాడారు.

షారుఖ్ ఖాన్ తన తాజా ట్వీట్ లో చెన్నైలో తన చివరి రోజు షూటింగును చాలా అందంగా గ‌డిపాన‌ని తెలిపాడు. అక్కడ రజనీకాంత్ జవాన్ సెట్స్ ను అలంకరించడం... నయనతార త‌న‌తో క‌లిసి సినిమా చూడటం.. విజయ్ సేతుపతి అతనితో సంభాషించ‌డం.. ధ‌ళ‌పతి విజయ్ అతనికి ఆహారం ఇవ్వడం...అనిరుధ్ రవిచందర్ తో కలిసి డ్యాన్స్ చేయడం ఇలా త‌న అంద‌మైన మూవ్ మెంట్స్ గురించి ప్రస్తావించారు.

చెన్నైలో గొప్ప ఆతిథ్యం ఇచ్చినందుకు దర్శకుడు అట్లీ అతని భార్య ప్రియకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్రీక‌ర‌ణ ముగింపు రోజున‌ చెన్నైలోని ఓ హోటల్ లో ర్యాప్ పార్టీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. భారతదేశం లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో జవాన్ ఒకటి. 2 జూన్ 2023న ఈ చిత్రం విడుదల కానుంది. టీజర్ ఇంత‌కుముందే విడుద‌లై ఆక‌ట్టుకుంది. వీక్షకుల నుండి ఏకగ్రీవంగా సానుకూల స్పందన వచ్చింది. ట్రైల‌ర్ తో మ‌రింత హైప్ పెంచ‌నున్నార‌ని స‌మాచారం.

షారుఖ్ ఖాన్ తదుపరి చిత్రం పఠాన్. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో  ఈ సినిమా తెర‌కెక్కుతోంది. జాన్ అబ్రహం -దీపికా పదుకొనే కింగ్ ఖాన్ తో కలిసి ఈ చిత్రంలో నటించారు. 25 జనవరి 2023న విడుదల కానుంది.

జవాన్ జూన్‌లో విడుదల కానుంది. ఖాన్ న‌టించిన‌ డుంకీ చిత్రాన్ని 2023 క్రిస్మస్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. డుంకీ తర్వాత షారుఖ్ ఖాన్ తన సినిమాల కోసం స్క్రిప్ట్‌లు కథలు వినడం ప్రారంభించినట్లు సమాచారం. తన చివరి చిత్రం జీరో తర్వాత షారూక్ సుదీర్ఘంగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News