ఒకపక్క కుర్ర హీరోలు న్యూ జెనరేషన్ స్టార్లు ఏడాదికో సినిమా చేయడానికే కిందామీదా పడుతుంటే వయసుని సైతం లెక్క చేయకుండా సంవత్సరానికి కనీసం రెండు సినిమాలు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ని చూస్తే ఔరా అనిపించక మానదు. ప్రస్తుతం నిర్మాణంలో దర్బార్ షూటింగ్ చివరి దశకు వచ్చింది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న ఈ మూవీకి మురుగదాస్ దర్శకుడు కావడం అంచనాలు పెంచుతోంది. నవంబర్ 7న అఫీషియల్ ఫస్ట్ లుక్ తో పాటు థీమ్ మ్యూజిక్ ని రిలీజ్ చేయబోతున్నారు.
దీని తర్వాత సిరుతై శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించే సినిమా వెంటనే ప్రారంభించబోతున్నారు రజని. ఇదెక్కడి స్పీడ్ బాబోయ్ అంటూ కోలీవుడ్ లో అందరూ షాకింగ్ గా చర్చించుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రజని సినిమాలు పూర్తి చేస్తున్న మాట వాస్తవం. తక్కువ గ్యాప్ లో 2.0- పేట లు వచ్చాయి. అంతకు ముందు కాలాకు పెద్ద టైం డిస్టెన్స్ లేదు. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగబోతోంది. కేవలం రెండు మూడు నెలల కాల్ షీట్స్ లోనే సినిమా మొత్తం పూర్తయ్యేలా రజని ముందే తన దర్శకులకు సూచనలు ఇస్తున్నారట.
ఎన్ని వందల కోట్ల బిజినెస్ చేసినా చేయకపోయినా బడ్జెట్ మాత్రమె కంట్రోల్ లోనే ఉండేలా జాగ్రత్త పడుతున్నారట. ఎలాగూ ఇతర భాషల్లో రజని మూవీస్ ఆశించిన సక్సెస్ అందుకోవడం లేదు. పేట తమిళ్ లో 100 కోట్లు రాబట్టినా తెలుగులో 5 కోట్లకే ముచ్చెమటలు పట్టించింది. 2.0 రెవిన్యూ పరంగా నిర్మాతలకు నష్టాలే ఇచ్చింది. ఇక కాలా-కబాలిల సంగతి సరేసరి. దర్బార్ తో అయినా ఈ పరిస్థితి మారుతుందేమో చూడాలి. నయనతార హీరోయిన్ గా నటించిన దర్బార్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది