ట్రైలర్ టాక్: ట్రాప్ లో పడితే ఇంతే

Update: 2017-02-23 07:43 GMT
ఉదాన్.. లుటేరా వంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ను తీయడంలో దర్శకుడు విక్రమాదిత్య మొత్వాని దిట్ట. ఇప్పుడీ దర్శకుడు 'ట్రాప్డ్' అనే మూవీని అందిస్తున్నాడు. రాజ్ కుమార్ రావ్ హీరోగా నటించిన ఈ చిత్రం ట్రైలర్ ను ఇప్పుడు రిలీజ్ చేశారు.

బయటకు వెళ్లేందుకు హడావిడిగా రెడీ అయి బయటకు వచ్చిన హీరోకి.. తన గాళ్ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లోపలే ఉందని గుర్తించి.. కంగారులో 'కీ'స్ ను డోర్ కే వదిలేసి హీరో లోపలకు వెళ్లినపుడు.. గాలికి డోర్ పడిపోయి ఆటోమేటిక్ లాక్ పడిపోతుంది. ఓ మల్టీస్టోరీడ్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్ లో ఇరుక్కుపోయిన రాజ్ కుమార్ రావ్.. అక్కడి నుంచి రోజుల పాటు తిండి నీళ్లు లేకుండా ఆ అపార్ట్ మెంట్ లో ఉండిపోవాల్సి వస్తుంది. బయటకు వచ్చేందుకు ఏం చేశాడు.. ఎంత కష్టపడ్డాడు.. ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశాడు అనే థీమ్ తో ఈ మూవీని రూపొందించాడు దర్శకుడు విక్రమాదిత్య మొత్వాని.

కాన్సెప్ట్ చిన్నదే అయినా.. దాన్ని దర్శకుడు విక్రమాదిత్య తెరకెక్కించిన విధానం.. హీరో రాజ్ కుమార్ రావు నటన ఆకట్టుకుంటాయి. గతేడాది అక్టోబర్ లో జరిగిన జియో మామి ఫిలిం ఫెస్టివల్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా.. స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఇప్పుడీ 'ట్రాప్డ్' ట్రైలర్ ను విడుదల చేయగా.. మార్చ్ 17న మూవీని రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News