సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల గురించి తమిళనాడులో సుదీర్ఘ కాలంగా చర్చ జరుగుతుంది. ఒక పిల్లాడు పుట్టక ముందు నుండి రజినీకాంత్ రాజకీయాల గురించి చర్చ జరుగుతుంటే ఇప్పుడు ఆ పిల్లాడు పెద్ద వాడు అయ్యి జీవితంలో సెటిల్ అయ్యి పిల్లలు కూడా పుట్టి ఉంటారు. కాని ఇప్పటి వరకు కూడా రజినీకాంత్ రాజకీయాల గురించి చర్చ మాత్రమే జరుగుతుంది. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది లేదు. ఇది తమిళనాడులో పాపులర్ అయిన జోక్. ఇదే జోక్ ను ఒక తమిళ మూవీలో పెడితే రజినీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని అది నిజమే అయినా వారు జీర్ణించుకోలేక పోతున్నారు. రజినీకాంత్ రాజకీయాల గురించి మళ్లీ ఇప్పుడు పతాక స్థాయిలో చర్చ జరగుతోంది.
కొన్ని నెలల క్రితం రజినీకాంత్ స్వయంగా మాట్లాడుతూ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నాను. పార్టీ పెట్టి 2021 ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ ప్రకటించాడు. జయలలిత మరియు కరుణానిధి ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో ఖచ్చితంగా రజినీకాంత్ కు స్కోప్ ఉందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రజినీకాంత్ సైలెంట్ గా ఉన్న కారణంగా ఆయన అభిమానులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కరోనా కారణంగా బయటకు రాలేక పోతున్న రజినీకాంత్ ఈసారి పోటీ చేసే విషయమై రాజకీయ పార్టీ పెట్టే విషయమై ఆలోచల్లో పడ్డాడు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటూ ఆయన ఇంటి ముందు దర్నాలు దీక్షలు ఆందోళనలు చేస్తున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఈ ఆందోళనలు చేస్తున్నారు. కాని రజినీకాంత్ మాత్రం పట్టించుకోవడం లేదు. వయసు రీత్యా మరేదైనా కారణం రీత్యా రాజకీయాల్లోకి రాలేక పోతున్నాను అంటూ ఒక్క మాట అంటే అభిమానులు రెండు రోజులు బాధ పడతారు ఆ తర్వాత వారి పనుల్లోకి వారు వెళ్లి పోతారు. కాని రజినీకాంత్ మాత్రం వారితో దాగుడు మూతలు ఆడుతున్నారు. దాంతో అభిమానులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు రజినీకాంత్ రాజకీయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.