ప్రముఖ కమెడియన్ కు జైలు శిక్ష

Update: 2018-04-24 10:38 GMT
రాజ్ పాల్ యాదవ్.. బాలీవుడ్ సినిములు చూసేవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అసవరం లేని పేరు. వందల కొద్దీ హిందీ సినిమాల్లో నటించాడతను. తెలుగులోనూ ‘కిక్-2’ సినిమాలో నటించాడు రాజ్ పాల్. ఈ నటుడికి ఢిల్లీలోని లోకల్ కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఢిల్లీకి చెందిన అగర్వాల్ అనే వ్యాపారవేత్త దగ్గర రూ.5 కోట్ల అప్పు తీసుకుని.. తిరిగి చెల్లించనందుకు కోర్టు రాజ్ పాల్ కు ఈ శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవించడంతో పాటు అగర్వాల్ కు 11.2 కోట్ల  రూపాయలు చెల్లించాలని జడ్జి తీర్పు ఇచ్చారు. రాజ్ పాల్ భార్య రాధ యాదవ్‌ కు కోర్టు 70 లక్షల జరిమానా విధించడం గమనార్హం. ఈ తీర్పు అనంతరం రాజ్‌పాల్‌కు రూ.50 వేల వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు.

2010 లో రాజ్‌పాల్‌ తనే నటిస్తూ దర్శకత్వం వహించబోయే ‘ఆట పాట లపాట’ అనే సినిమా కోసం ఢిల్లీకి చెందిని మురళీ ప్రాజెక్ట్‌ కంపెనీ యజమాని  అగర్వాల్‌ దగ్గర నుంచి రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని వడ్డీతో  కలిపి 2011 డిసెంబర్‌ 3 నాటికి తిరిగి చెల్లిస్తానని నోటు రాసి ఇచ్చాడు. కానీ డబ్బులు సకాలంలో చెల్లించలేకపోయాడు. దీంతో ఆ వ్యాపారవేత్త ఈ రాజ్‌ పాల్‌ దంపతుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన ఢిల్లీ హై కోర్టు అప్పు చెల్లించడానికి ఈ దంపతులకి చాలా అవకాశాలు ఇచ్చింది, కానీ వారు అప్పు చెల్లించలేదు. దీంతో సోమవారం జడ్జి రాజ్ పాల్ కు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు. రాజ్ పాల్ రెండు దశాబ్దాలకు పైగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నాడు. ‘భూల్‌భూలయియా’, ‘పార్టనర్‌’, ‘హంగామా’ లాంటి సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చాయి.
Tags:    

Similar News