రాజు గారి గది2 లేటవుతోందే

Update: 2017-07-18 04:53 GMT
ఓ సినిమా తనకు నచ్చితే కానీ.. రిలీజ్ చేసే ఛాన్స్ లేదని.. గతంలోనే తేల్చేశారు నాగార్జున. ఇప్పుడు అదే మాటకు ఆయన కట్టుబడి ఉన్నట్లుగా కనిపిస్తోంది. రాజు గారి గది2లో నటించిన నాగ్.. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తయిపోయినా.. రిలీజ్ సంగతి మాత్రం తేల్చడం లేదు.

దర్శకుడిగా అరంగేట్రంలో ఎదురుదెబ్బ తిన్న యాంకర్ ఓంకార్.. రెండో మూవీ రాజుగారిగది తో సంచలన విజయం సాధించాడు. దానికి సీక్వెల్ అంటూ సినిమాను స్టార్ట్ చేసేందుకు ఎక్కువ సమయమే తీసుకున్నా.. పీవీపీ వంటి బ్యానర్ పై.. నాగార్జున.. సమంత లాంటి యాక్టర్స్ సినిమా స్టార్ట్ చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే.. సినిమా కంప్లీట్ అయ్యాక ఔట్ పుట్ చూసుకోవడం.. తనకు నచ్చని సీన్స్ ను మళ్లీ రీషూట్ చేయిండం నాగ్ కు అలవాటు. ఇప్పుడు రాజుగారి గది2 విషయంలో కూడా ఇదే జరుగుతోందట. పైగా ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ అవసరం కూడా ఉందని అంటున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మొదలు కూడా పెట్టకపోవడంతో.. ఇప్పుడే రిలీజ్ డేట్ చెప్పడం కూడా కష్టమనే టాక్ ఉంది. వీటితో పాటు చైతు నటించిన యుద్ధం శరణం గచ్ఛామిని ఆగస్ట్ లో రిలీజ్ చేసే యోచనలో  ఉంది. ఇళాంటి సమయంలో.. కొడుకు సినిమాపై తనే పోటీకి వెళ్లే ఆలోచన కూడా నాగార్జునకు లేదని అంటున్నారు.
Tags:    

Similar News