స్టార్ హీరో తండ్రికి క్యాన్సర్

Update: 2019-01-08 06:53 GMT
రాకేష్ రోషన్ అంటే కన్నా..  బాలీవుడ్  స్టార్ హీరో హృతిక్ రోషన్ తండ్రి అంటే అందరికీ వెంటనే తెలుస్తోంది. కొడుకు హృతిక్ ను బాలీవుడ్ లో స్టార్ హీరో చేయడంలో రాకేష్ ఎన్నో త్యాగాలు చేశారు. ఆయనే నిర్మాత, దర్శకుడిగా మారి తీసిన ‘క్రిష్’ సిరీస్ సినిమాలు దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాలు సాధించాయి. దర్శకుడిగా, నిర్మాతగా ఆయనకు మంచి పేరు తెచ్చాయి. కొడుకు హృతిక్ తో తప్పితే వేరే హీరోలతో ఆయన పెద్దగా సినిమాలు తీయలేదు.

తాజాగా తండ్రి రాకేష్ రోషన్ అస్వస్థతతో ఉండగా తాను దిగిన ఫొటోను హృతిక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తన తండ్రి అనారోగ్యం గురించి బాంబు పేల్చారు. రాకేష్ రోషన్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు సంచలన నిజాన్ని వెల్లడించారు.

రాకేష్ రోషన్ కు గొంతుకు సంబంధించిన క్యాన్సర్ సోకినట్టు హృతిక్ వివరించారు. సర్జరీ నేడు చేస్తున్నామని ఆయన చాలా ధైర్యంగా ఈ వ్యాధిని ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. క్యాన్సర్ ను జయించడానికి తన తండ్రి సిద్ధమయ్యాడని వివరించారు.

బాలీవుడ్ ను క్యాన్సర్ కబళిస్తోంది. ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్ - సోనాలి బింద్రే సహా చాలా మంది క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పుడు హృతిక్ తండ్రి కూడా ఆ వ్యాధి బారిన పడడం బాలీవుడ్ ను కుదిపేస్తోంది.


Full View

Tags:    

Similar News