రాఖీ సావంత్ బురఖాతో కోర్టుకు..

Update: 2017-07-08 12:27 GMT
వివాదాస్పద నటి రాఖీ సావంత్ ఎట్టకేలకు కోర్టు మెట్లు ఎక్కింది. రామాయణం గురించి.. దాని రచయిత వాల్మీకి గురించి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసిన కేసుకు సంబంధించి.. ఇన్నాళ్లూ తేలిగ్గా మాట్లాడిన ఆమె.. చివరికి లూథియానా కోర్టులో హాజరైంది. ఆమె బురఖా వేసుకుని కోర్టుకు హాజరవడం విశేషం. ఈ కేసు విషయమై రాఖీ సావంత్ ను అరెస్టు చేయాలని లూథియానా కోర్టు రెండోసారి అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆమె కోర్టు మెట్లెక్కక తప్పలేదు. తనను ఎవరూ గుర్తించకుండా బురఖాలో ఆమె కోర్టుకు హాజరైంది. ఆమెను మందలించిన కోర్టు షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది.

వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేరైన రాఖీ సావంత్.. ఒక టీవీ షోలో భాగంగా రామాయణం గురించి తేలిక చేసి మాట్లాడింది. రామాయణ గ్రంథ కర్త వాల్మీకిని కూడా అవహేళన చేసింది. దీంతో హిందూ వాదులు ఆమెపై మండిపడ్డారు. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె మీద కేసు కూడా నమోదైంది. కానీ కేసు పెట్టినా తనను ఎవరూ ఏమీ చేయలేరని.. క్షమాపణలు చెప్పనని తెగేసి చెప్పింది రాఖీ.

ఆమెపై కేసు లూథియానా కోర్టుకు చేరగా.. నోటీసులు అందుకున్నాక కూడా ఆమె కోర్టుకు రాలేదు. దీంతో కోర్టు రెండోసారి ఆమె అరెస్ట్ కోసం వారెంట్ జారీ చేసింది. తొలిసారి అరెస్ట్ వారెంట్ జారీ చేసినపుడు పంజాబ్ పోలీసులు ముంబయికి రాగా.. ఆమె వారికి దొరకలేదు. తర్వాత తనకు ముందస్తు బెయిల్ కోసం లూథియానా కోర్టులో దరఖాస్తు చేసుకుంది రాఖీ. ఐతే ఆమె విన్నపాన్ని తిరస్కరించిన కోర్టు మళ్లీ అరెస్ట్ వారెంట్ జారీచేసింది. దీంతో రాఖీ కోర్టుకు రాక తప్పలేదు. కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో ఆమెకు బెయిల్ మంజూరైంది.
Tags:    

Similar News