సన్నీకి రాఖీ సావంత్ సారీ

Update: 2018-06-05 14:30 GMT
శృంగార తార సన్నీ లియోన్ పేరెత్తితే చాలు మండిపోయేది బాలీవుడ్ ఐటెం భామ రాఖీ సావంత్. సన్నీ రాకతో తన అవకాశాలకు గండి పడటమే ఇందుకు కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు వరకు బాలీవుడ్లో ఐటెం సాంగ్స్.. వ్యాంప్ క్యారెక్టర్లకు రాఖీని కొంత వరకు కన్సిడర్ చేసేవాళ్లు. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫాలోయింగే ఉండేది. కానీ సన్నీ వచ్చాక రాఖీకి బాగా డిమాండ్ పడిపోయింది. ఆమెను పట్టించుకునేవాళ్లే కరవయ్యారు. దీంతో తన అక్కసు మొత్తాన్ని సన్నీ మీద చూపించేసింది రాఖీ. సన్నీ లియోన్ వల్ల ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నాశనమైందని.. ఆమెను కుటుంబ సభ్యులు ఇంటి నుంచి తరిమేస్తే పోర్న్ ఇండస్ట్రీకి వెళ్లిందని.. ఆమెకు భారతీయ సినిమాల్లో అవకాశాలివ్వడం సరి కాదని.. ఆమె మన ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోవాలని అప్పట్లో విరుచుకుపడింది రాఖీ.

ఐతే అప్పటి తన వ్యాఖ్యలపై రాఖీ ఇప్పుడు విచారం వ్యక్తం చేసింది. సన్నీకి సారీ కూడా చెప్పింది. తాజాగా ఒక టీవీ ఛానెల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఖీ మాట్లాడుతూ.. తాను అనవసరంగా సన్నీని తిట్టానని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. ఆమె ప్రయాణం.. తన గతం.. కష్టాల గురించి తెలియకుండా విమర్శించడం.. దూషించడం తప్పని అభిప్రాయపడింది. సన్నీ జీవితాన్ని నిర్దేశించే హక్కు తనకు లేదని కూడా ఆమె అంది. నిజానికి సన్నీ పోర్న్ ఇండస్ట్రీ నుంచి వచ్చి బాలీవుడ్ సినిమాల్లో నటించడాన్ని మొదట్లో చాలామంది తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ తర్వాత తర్వాత ఆమెకు అలవాటు పడ్డారు. ఒక భారతీయ అనాథ చిన్నారిని దత్తత తీసుకోవడంతో పాటు.. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సన్నీ తన పెద్ద మనసును చాటుకుంది. ఆమె జీవిత కథతో ఒక వెబ్ సిరీస్ కూడా రాబోతోంది. అది వచ్చాక సన్నీపై జనాల అభిప్రాయం మరింత మారుతుందని భావిస్తున్నారు.
Tags:    

Similar News