డేరింగ్ అండ్ డ్యాషింగ్ లేడీగా.. హాట్ భామగా అందరికి సుపరిచితురాలు.. ఎప్పుడు ఎలాంటి సంచలన వ్యాఖ్య చేస్తుందో అన్నట్లుగా ఉండే బాలీవుడ్ బ్యూటీ.. నటి రాఖీ సావంత్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ పరివ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై ఆమె రియాక్ట్ కావటమే కాదు.. ఊహించనిరీతిలో పలు విషయాల్ని బయటపెట్టారు. అంతేకాదు.. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటూ బాంబు పేల్చారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతులు అవకాశాల కోసం ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. యువతులే అలా ఉన్నప్పుడు ప్రొడ్యూసర్లను ఎందుకు తప్పు పడతారు? అంటూ ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమలో ఎవరూ అత్యాచారాలు చేయరని.. స్వచ్ఛందంగా పరస్పర అంగీకారంతోనే ఈ వ్యవహారం నడుస్తుందన్నారు.
బాలీవుడ్‌ను అగౌరవపర్చటం తన ఉద్దేశం కాదన్న రాఖీసావంత్.. ఈ మధ్యన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు దన్నుగా నిలిచేలా రాఖీ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. ఏమైనా చేయండి.. అవకాశాలు ఇవ్వండన్నది నేటితరం యువతుల తీరుగా ఉందన్న ఆమె.. హీరోయిన్స్ కావాలని పరిశ్రమకు వచ్చిన చాలామంది అమ్మాయిలు మరేదో అవుతున్నారన్నారు.
తమ కళ్ల ముందే లైంగిక వేధింపులు జరుగుతున్నా.. బయట ప్రపంచానికి నిజాల్ని వెల్లడించరంటూ బాలీవుడ్ జనాలపై విమర్శల్ని గుప్పించారు. క్యాస్టింగ్ కౌచ్ కు సంబంధించి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానన్నారు. బాలీవుడ్‌లో నిలదొక్కుకునే సమయంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానన్నారు.
అయితే.. ప్రతి నిర్మాత.. దర్శకుడు అలా వ్యవహరించలేదన్న ఆమె.. చిత్రపరిశ్రమలో లైంగిక అవినీతి ఉందన్నారు. మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నా తర్వాత మాత్రం ప్రతిభతో వాటిని అధిగమించానన్నారు. లైంగిక వేధింపులకు యువతులే కాదు.. యువకులు కూడా మినహాయింపేమీ కాదన్నారు.
సల్మాన్.. ప్రియాంక చోప్రాలు ప్రతిభతో రాణించారన్నారు. విజయానికి ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవన్న రాఖీ సావంత్ అవకాశాల కోసం రాజీ పడొద్దంటూ సూచన చేశారు. టాలెంట్ ను నమ్ముకోవాలన్న ఆమె.. ఎలాంటి ప్రలోభాలకు.. పక్కదారుల బారిన పడొద్దని సూచన చేశారు. విషయం ఏదైనా కుండబద్ధలుకొట్టినట్లుగా మాట్లాడే రాఖీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.