రాఖీసావంత్ విడాకుల‌ గేమ్ ప్లాన్ ఇదేనా!

Update: 2022-02-18 05:34 GMT
స‌రిగ్గా ప్రేమికుల దినోత్స‌వం రోజునే భ‌ర్త రితేష్ తో విడిపోతున్న‌ట్లు బాలీవుడ్ న‌టి రాఖీసావంత్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మూడేళ్ల ధాంప‌త్య బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఈ జంట విడాకుల నిర్ణ‌యం తీసుకుంది. విడాకుల నిర్ణ‌యానికి ముందు క‌లిసి ఉండ‌టానికి చాలా ప్ర‌య‌త్నించామ‌ని కానీ వృత్తిప‌రంగా..ఇత‌ర కొన్ని అంశాల మ‌ధ్య ఇద్ద‌రి మ‌ధ్య పొంత‌న కుద‌ర‌క‌పోవ‌డంతో విడిపోయి ఎవ‌రి జీవితాల్లో వారు సంతోషంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు రాఖీ సావంత్ తెలిపింది.

ఈ విష‌యం ఇద్ద‌ర్ని బాధించిన‌ప్ప‌టికీ త‌ప్ప‌క తీసుకున్న నిర్ణ‌య‌మ‌ని రాఖీ ఎమోష‌న‌ల్ అయ్యారు. అయితే దీని వెనుక గ‌ల అస‌లు కార‌ణాల్ని రాఖీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో వివ‌రించే ప్ర‌య‌త్నం చేసారు. మీడియా ముందుకొచ్చిన‌ప్పుడ‌ల్లా నేను అత‌న్ని ఎంతో ప్రేమ‌గా ముద్దుపెట్టు కోవ‌డం అంద‌రూ చూసి ఉంటారు. ఆ స‌మ‌యాల్లో క‌నీసం అత‌ను న‌న్ను తాక‌ను కూడా తాకేవాడు కాదు. అంద‌రి ముందు సిగ్గుప‌డుతు న్నాడేమో అనుకునే దాన్ని. చాలా రోజుల పాటు  సిగ్గే కార‌ణం అనుకున్నా.

కానీ ఆ త‌ర్వాత‌నే అస‌లు విష‌యం తెలిసింది. అత‌నికి ఇది వ‌ర‌కూ పెళ్లి అయింద‌ని.. ఓ బాబు ఉన్నాడ‌ని విన్నాను. నా గుండె ప‌గిలినంత ప‌నైంది.  అయినా నాకు ఎలాంటి అభ్యంత‌రం లేదనుకుని అత‌నితో జీవితాన్ని పంచుకోవాల‌నుకున్నా. ఈ క్ర‌మంలోనే న‌న్ను ఒంట‌రిగా వ‌దిలేయోద్ద‌ని ఎంతో వేడుకున్నా. కాళ్లు ప‌ట్టుకుని బ్ర‌తిమ‌లాడా. అయినా నా మాట వినిపించుకోలేదు. త‌న దారి త‌న‌ద‌న్న‌ట్లు వ్య‌వ‌రించాడు. దీంతో నేను కూడా మ‌న‌సు ముక్క‌లు చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని రాఖీ సాంత్  బురువెక్కిన గుండెతో వినిపించింది.

అయితే విడిపోయినా 2022లో  రితేష్ తోనే పిల్ల‌లు కంటాన‌ని తెలిపింది. దీంతో ఈ విడాకులు ఓ డ్రామా అనే సందేహం తెర‌పైకి వ‌స్తోంది. రితేష్ కి ఇంత‌కు ముందు స్నిగ్ధ ప్రియ‌తో వివాహం జ‌రిగింది. మొద‌టి భార్య‌కు విడాకులు ఇవ్వ‌కుండా రాఖీసాంత్ ని వివాహం చేసుకున్నాడు. ఇద్ద‌రు జంట‌గా బాలీవుడ్ బిగ్ బాస్ షోకి వెళ్లిన‌ప్పుడు రితీష్ మొద‌టి భార్య అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. దీంతో రితేష్-రాఖీ న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల్లో ప‌డ్డారు.

వాటి నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే మ్యూచివ‌ల్ గా విడిపోవాలి. ఐదేళ్ల‌గా ఇద్ద‌రి మ‌ధ్య తీవ్ర‌మైన ఘ‌ర్ష‌ణ‌లు ఉన్న‌ట్లు కోర్టులో నిరూపించాలి. అప్పుడే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. ఆ విధ‌మైన గేమ్ ప్లాన్ ఈ జంట  ప్లాన్ చేసిందా? అని రాఖీ మాట‌ల నేప‌థ్యంలో  కొత్త  సందేహాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

 చ‌ట్ట‌ప‌రంగా రాకీసావంత్ తో విడాకులు సుల‌భం. స్నిగ్ధ ప్రియ‌తో విడాకులు తీసుకోవాలంటే కోట్ల రూపాయ‌లు భ‌ర‌ణం చెల్లించాలి. అప్పుడు గానీ రిత‌ష్ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం సాధ్య‌ప‌డ‌దు. అందుకే  ఇలా గేమ్ ప్లాన్ చేసింద‌ని గుస‌గుస వినిపిస్తోంది. 
Tags:    

Similar News