షాహిద్ ఉదాహరణ చెప్పిన సెక్సీ బ్యూటీ!

Update: 2019-07-17 05:38 GMT
ఈ జెనరేషన్ లో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ట్రోలింగ్ ఎదుర్కోకుండా ఉండడం అసాధ్యం.  నెటిజన్లు ఏదో ఒక విషయం మీద ట్రోల్ చేస్తారు.. ఏ విషయం లేకపోతే తుఫాన్ బాధితులకు డొనేషన్ ఇవ్వలేదని అంటారు.  ఒకవేళ విరాళం ఇస్తే.. "కోట్లకొద్ది సంపాదిస్తారు.. ఫలానా వారు అంత ఇచ్చారు.. మీరెందుకు ఇవ్వలేదు" అని విమర్శిస్తారు.  జనాలు ఇలా నున్నటి గుడ్ల మీద ఈకలు పీకుతూ ఉంటే సెలబ్రిటీలు ట్రోలింగ్ నుంచి ఎలా తప్పించుకోగలరు?  రకుల్ కూడా ఈమధ్య ట్రోలింగ్ కు గురయింది.

'మన్మథుడు 2' టీజర్లో రకుల్ సిగరెట్ కాల్చే సీన్ ఉంది.  సరిగ్గా ఆ స్మోకింగ్ సీన్ పైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి విమర్శల గురించి.. ట్రోలింగ్ గురించి కొద్దిరోజుల క్రితం రకుల్ తో ప్రస్తావిస్తే పనిలేని వాళ్లే విమర్శలు చేస్తుంటారని ఘాటుగా సమాధానం ఇచ్చింది.  అంతే కాదు.. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఉదాహరణ చెప్తూ షాహిద్ 'కబీర్ సింగ్' లో ఎలా ఉన్నాడో దానికి పూర్తి భిన్నంగా నిజ జీవితంలో ఉంటాడు. సినిమాలో నటన వేరు.. నిజ జీవితం వేరు అంటూ క్లారిటీ ఇచ్చింది.  

షాహిద్ కపూర్ రియల్ లైఫ్ లో ఓ వెజిటేరియన్.  స్మోకింగ్.. ఆల్కహాల్.. డ్రగ్స్ లాంటి వాటికి ఆమడ దూరంలో ఉంటాడు.  కానీ స్క్రీన్ పై కబీర్ సింగ్ పాత్ర చూస్తే ఆ షాహిద్ ఈ షాహిద్ ఒకరని నమ్మలేరు.  అంత సహజంగా ఉంటుంది నటన.  షాహిద్ ఉదాహరణ చూపించి మరీ రకుల్ చెప్పిన లాజిక్ నిజమే. నటీనటులు పాత్ర డిమాండ్  మేరకు నటిస్తారు. జనాలు ప్రతిదాన్ని భూతద్దంలో చూస్తూ విమర్శిస్తే.. వాటిని ఈ సెలబ్రిటీలు పట్టించుకుంటే నటన మానేసి ఇంట్లో కూర్చోవాల్సిందే!

 
    

Tags:    

Similar News