రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం టాలీవుడ్ కుర్ర భామల్లో అత్యధిక జోరు మీదున్న సుందరాంగి. వరుసపెట్టి హిట్ సినిమాలు పడుతున్నాయి. ఈమె కెరీర్ లో ఫ్లాప్ ల కౌంట్ కూడా తక్కువే. పైగా ఇప్పుడు వరుస హిట్స్ తో జోరు కూడా చూపిస్తోంది. అయినా.. సరే ఇప్పటివరకూ రకుల్ ప్రీత్ కోటి రూపాయల క్లబ్ లో ఎంటర్ కాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది.
ఈ ఏడాదిని నాన్నకు ప్రేమతో లాంటి హిట్ తో స్టార్ట్ చేసింది రకుల్. ఇప్పుడు సరైనోడుతో మరో మాంచి హిట్ నే కొట్టింది. గతంలో కిక్ 2 - బ్రూస్ లీ మినహాయిస్తే.. రకుల్ కెరీర్ అంతా సాఫీగానే సాగింది. మరి ఇంత జోష్ ఉన్నపుడు మినిమం కోటి ఛార్జ్ చేయడం కామన్. కానీ ఇప్పటికీ రకుల్ ప్రీత్ సింగ్ ఒక్కో సినిమాకి తీసుకునే మొత్తం 50లక్షల్లోపే అంటే ఆశ్చర్యం వేయకమానదు. అదే బాలీవుడ్ భామలను ఇంపోర్ట్ చేసుకుంటే.. మొదటి సినిమాకే కోటి ఆఫర్ చేసే మన నిర్మాతలు.. రకుల్ ఇంకా కోటి ఇచ్చేందుకు రెడీ అవడం లేదు.
రకుల్ రెమ్యూనరేషన్ రేటు ఇంత తక్కువగా ఉండడానికి కారణం.. ఇప్పటికీ ఆమె కుర్ర హీరోలతో, కొత్త హీరోలతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపించడమే అంటున్నారు. ప్రస్తుతం మెగా క్యాంప్ లో వరుసగా సినిమాలు చేస్తున్న రకుల్.. ఇప్పటివరకూ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా ఇవ్వలేకపోవడాన్ని మరో కారణంగా చూపుతున్నారు. ఈ భామ కనీసం ఒకటి రెండు బ్లాక్ బస్టర్లు ఇస్తే తప్ప.. కోటి అందుకునే అవకాశాలు లేవన్నది ఇండస్ట్రీ టాక్.