అవార్డుల ఫంక్షన్ లు, సినిమా పండుగలు అంటే అన్నిటికంటే ఎక్కువ ఆకర్షణ హీరోయిన్లే. సాధారణంగా ఒకరిద్దరు మాత్రమే కనిపించే భామలు.. అవార్డు వేదికల్లో మాత్రం అందరూ ఒకేసారి కనిపిస్తారు. కళ్లు తిప్పుకుందామన్నా వీలు కుదరనంత, మనసు ఒప్పుకోనన్ని వయ్యారాలు కురిపిస్తారు. ఇప్పుడు హైద్రాబాద్ లో జరుగుతున్న ఐఫా అవార్డుల వేడుకలో సౌత్ సుందరాంగులు మొత్తం సందడి చేసేస్తున్నారు.
ఇందులో టాలీవుడ్ కుర్రభామల సందడే ఎక్కువగా కనిపిస్తోంది. గ్రీన్ కలర్ స్లీవ్ డ్రస్ లో వచ్చినా తమన్నా మెరుపులు మామూలుగా లేవు. పింక్ స్లీవ్ డ్రెస్ లో రాశి ఖన్నా సందడి చేసింది. ఇక రెజీనా కసాండ్రా అయితే రెడ్ కలర్ తో రెపరెపలాడించింది. లావణ్య త్రిపాఠి కూడా పింక్ నే సెలెక్ట్ చేసుకుంది. ప్రగ్యా జైస్వాల్ లైట్ రెడ్ కలర్ డ్రసింగ్ తో మెరిసిపోయింది. బ్లాక్ డ్రెస్ వేసుకుని క్లీవేజ్ షో చేసిన మమతా మోహన్ దాస్ అందరినీ ఆకట్టుకుంది. పూనమ్ కౌర్ కూడా నలుపు రంగుకు బాగా నప్పింది. శాన్వీ శ్రీవాస్తవ తెల్లని దుస్తుల్లో ధగధగలాడింది. కానీ వీరందరూ మోడ్రన్ డ్రస్సుల్లోనే మెరిశారు.
ఒక్క రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ శారీలో వెలుగులు విరజిమ్మింది. చీరకట్టులో ఈ భామ ఇంత అందంగా ఉంటుందా అనిపించింది కూడా. ఫ్యాషన్ లో మిగిలిన అందరు భామలను మించిపోయి ఆకట్టుకుంది. చివరకు ఫ్యాషన్ ఎనలిస్టులు అందరూ రకుల్ ప్రీత్ కే ఓటేయడం విశేషం. తెలుగు మాట్లాడ్డం, డబ్బింగ్ చెప్పడమే కాదు.. చీరకట్టులో తెలుగందాలను కూడా ప్రదర్శించేసింది రకుల్ ప్రీత్ సింగ్.
మోర్ పిక్స్ కోసం క్లిక్ చేయండి : http://goo.gl/nqgC1A