రచ్చ గెలిచి ఇంట గెలవడం అన్నది నేటితరం కథానాయికల స్టైల్. ముంబై పరిశ్రమలో నిరంతరం ఉండే ఠఫ్ కాంపిటీషన్ ని దృష్టి లో పెట్టుకుని తొలుత సౌత్ పరిశ్రమల్లో ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ ఒకసారి క్లిక్కవ్వగానే మాతృ పరిశ్రమ లో ప్రయత్నాలు మొదలవుతాయి. అయితే అక్కడ దెబ్బ తిన్నా సౌత్ కెరీర్ కి ఏ డోఖా ఉండదు. ఇలాంటి తెలివైన గేమ్ ప్లాన్ తోనే నార్త్ నుంచి సౌత్ కి వచ్చే భామలెందరో.
ఆ కోవలోనే పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సైతం ఆరంభమే ముంబై పరిశ్రమకు వెళ్లకుండా కన్నడలో నటించి అటుపై టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఇక్కడా సక్సెస్ వెంటనే వచ్చేయలేదు. ఆరంభం కొన్ని ఫ్లాపుల తర్వాత `వెంకటాద్రి ఎక్స్ ప్రెస్` లాంటి చిన్న సినిమాతో పెద్ద హిట్టు కొట్టింది. అటుపై ఏకంగా స్టార్ హీరోలపైనే కర్ఛీఫ్ లు వేసింది. అక్కడా మిశ్రమ ఫలితాలే. ఎవరో ఒకరు హిట్టిచ్చి ఆదుకున్నారు మినహా రకుల్ వల్లే హిట్ కొట్టింది అన్న పేరేమీ లేదు. అయినా ప్రస్తుతం సౌత్ లోనే అగ్ర కథానాయికల్లో ఒక భామగా పాపులారిటీ దక్కించుకుంది. ఆ క్రమంలోనే ముంబై పరిశ్రమపై ఆశ చావక అజయ్ దేవగన్ లాంటి స్టార్ సరసన `దే దే ప్యార్ దే` అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా చాలా ఆపసోపాలు పడి రెండో వారం నాటికి 100 కోట్ల క్లబ్ లో చేరింది. మన స్టార్ హీరోల సినిమాలు తొలి వీకెండ్ లోనే 100 కోట్ల కొల్లగొట్టేస్తుంటే అజయ్ దేవగన్ లాంటి సీనియర్ హీరో .. రకుల్ లాంటి గ్లామరస్ డాళ్ నటించిన `దేదే ప్యార్ దే` వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు ఏకంగా 18 రోజులు పట్టింది.
ఏదైతేనేం మొత్తానికి వందకోట్ల క్లబ్ అనిపించుకుంది కాబట్టి ఆ ఆనందాన్ని రకుల్ దాచుకోలేకపోయింది. వెంటనే సామాజిక మాధ్యమాల్లో ఆ రికార్డ్ గురించి ప్రస్థావించింది. దేదే ప్యార్ దే చిత్రం 10రోజుల్లో 75కోట్లు.. 18రోజుల్లో 89కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ కలుపుకుని 100కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. మొన్నటికి మొన్న ఎన్‌జీకే ఇంటర్వ్యూలో `దేదే ప్యార్ దే`తో హిట్ కొట్టాను హమ్మయ్య! అంటూ ఆనందం వ్యక్తం చేసింది. మొత్తానికి రకుల్ నటించిన తొలి రెండు సినిమాలు ఫ్లాపులయ్యాయి కాబట్టి ఈ రిజల్ట్ తనకు ఉత్సాహాన్నిచ్చేదేనని చెప్పాలి.