ఒక రకుల్.. ఇద్దరు హీరోలు

Update: 2016-12-10 17:30 GMT
ఈ ఏడాది ఆల్రెడీ నాన్నకు ప్రేమతో.. సరైనోడు లాంటి హిట్లను ఖాతాలో వేసుకుంది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ‘ధృవ’ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో రకుల్ ప్రీత్ గోల్డెన్ గర్ల్ అన్న ముద్ర వేయించేసుకుంది. ప్రస్తుతం తెలుగులో ఆమె ఉన్నంత ఫామ్ లో ఇంకే హీరోయిన్ లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు ఆమె తలుపు తడుతున్నాయి. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సరసన సినిమా చేస్తూనే.. ఇంకో మూడు నాలుగు ప్రాజెక్టులు ఓకే చేసింది రకుల్. ప్రస్తుతం ఆమె ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తుండటం విశేషం. ఇంకో ఏడాదిన్నర దాకా రకుల్ డేట్లు అసలు ఖాళీనే లేవు. అసలు ఖాళీ అన్నదే లేకుండా షూటింగుల్లో పాల్గొంటోంది రకుల్.

రకుల్ కాల్ షీట్లను బట్టి ఆమె నటిస్తున్న సినిమాల షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటుండటం విశేషం. ప్రస్తుతం రకుల్ నటిస్తున్న ‘విన్నర్’తో పాటు.. నాగచైతన్య-కళ్యాణ్ కృష్ణ సినిమా ఒకదానికి ఒకటి సమీపంలో షూటింగ్ జరుపుకుంటుండటం విశేషం. అలాగని అది రామోజీ ఫిలిం సిటీయేమో అనుకోకండి. విన్నర్ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుంటే.. చైతూ మూవీ షెడ్యూల్ అరకులో నడుస్తోంది. రకుల్ ఇటు అటు షటిల్ సర్వీస్ చేస్తూ రెండు చోట్లా షూటింగులో పాల్గొంటోంది. ఆమె టైమింగ్ కు తగ్గట్లుగా షూటింగ్ చేస్తుండటం విశేషం. దీన్ని బట్టే రకుల్ ఎంత డిమాండింగ్ పొజిషన్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మున్ముందు రకుల్ మరింత బిజీ అయ్యేలా కనిపిస్తోంది.
Tags:    

Similar News