డైరెక్ట‌ర్‌ కి ప‌న్నెండు...హీరోయిన్‌ కి ఒక‌టిన్న‌ర‌

Update: 2016-04-26 04:21 GMT
స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకొని ఓ రేంజిలో దూసుకెళుతోంది ర‌కుల్ ప్రీత్‌ సింగ్. అయినా ఆమె ఇప్ప‌టిదాకా కోటిరూపాయ‌ల మార్క్‌ ని అందుకోలేదు.  అవ‌కాశాలొస్తాయి క‌దా అని ఆమె నిర్మాత‌ల‌కి అందుబాటులోనే వుంటూ త‌క్కువ పారితోషిక‌మే తీసుకుంటోంది. స్టార్ హీరోయిన్ అయినా త‌క్కువ అమౌంటే కోట్ చేస్తోంది క‌దా అని అంద‌రూ ఆమెనే సంప్ర‌దిస్తున్నారు. దీంతో వ‌రుస అవ‌కాశాల‌తో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది ర‌కుల్‌. కానీ ఇటీవ‌ల ఆమె కూడా దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌నే  నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే ఓ సినిమాకోసం ఏకంగా కోటిన్న‌ర రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ట‌. ర‌కుల్‌ లాంటి క్రేజ్ హీరోయిన్ అడ‌గ‌టంతో నిర్మాత కాద‌న‌లేక‌పోయాడ‌ట‌. డ‌బుల్ ప్ర‌మోష‌న్ అందుకున్న‌ట్టుగా ఇప్పుడామె ఏకంగా కోటిన్న‌ర రూపాయ‌ల హీరోయిన్ అయిపోయింది. ఇంత‌కీ ఆమె ఏ సినిమాకోసం అంత తీసుకుంటుందో తెలుసా?  బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాకోసం.

బెల్లంకొండ శ్రీనివాస్  క‌థానాయ‌కుడిగా బోయ‌పాటి శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ ఎంట‌ర్‌ టైన‌ర్‌ గా తెర‌కెక్కనున్న  ఆ సినిమాకోసం ర‌కుల్‌ ని హీరోయిన్‌ గా ఎంచుకొన్నాడు బోయ‌పాటి. అయితే బెల్లంకొండ కొత్త హీరో కాబ‌ట్టి, తాను  స్టార్ రేంజ్‌ కి ఎదిగింది కాబ‌ట్టి ర‌కుల్ కోటిన్న‌ర రెమ్యున‌రేష‌న్ కోట్ చేసిందట. త‌న కొడుకు సినిమాకి  గ్లామ‌ర్ విష‌యంలో ఎప్పుడూ లోటు రానీయ‌ని నిర్మాత బెల్ల‌కొండ సురేష్ కూడా ర‌కుల్ కోట్ చేసిన అమౌంట్‌ కి ఓకే అన్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ద‌ర్శ‌కుడు బోయ‌పాటి కూడా ఈ సినిమా కోసం భారీ స్థాయిలోనే రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఆయ‌న‌కి ఏకంగా 12 కోట్లు ఇస్తున్నార‌ట‌. బాల‌కృష్ణ‌ - అల్లు అర్జున్‌ లాంటి స్టార్ల‌ను డైరెక్ట్ చేసిన బోయ‌పాటి కొత్త హీరోతో సినిమా అంటే ఆమాత్రం పారితోషికం తీస‌కోకుండా ఎలా వుంటాడు? త‌న కొడుకు ఈ సినిమాతో స్టార్ అవుతాడ‌ని న‌మ్ముతున్న బెల్లంకొండ  సురేష్ డైరెక్ట‌ర్‌ కి  12 కోట్లు ఇవ్వ‌డానికి ఒప్పుసుకొన్నాడు. ఇప్ప‌టికే అడ్వాన్సుగా స‌గం డ‌బ్బు ముట్ట‌జెప్పాడ‌ని తెలిసింది. క్రేజీ కాంబినేష‌న్‌ తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.
Tags:    

Similar News