రకుల్ అంత మాట అనేసిందా!?

Update: 2017-06-23 11:19 GMT
రకుల్ ప్రీత్ సింగ్ ని సెన్సేషనల్ బ్యూటీ అనడంలో తప్పేమీ లేదు. ఈ భామ వరుసగా దక్కించుకుంటున్న ప్రాజెక్టుల రేంజ్ అలా ఉంటోంది మరి. అయితే.. టాలీవుడ్ పై తనకు ఎనలేని ప్రేమ అని చెబుతూ ఉంటుంది రకుల్ ప్రీత్. అందుకు తగ్గట్లుగానే ఈ భామ బిహేవియర్ కూడా ఉంటుంది.

హైద్రాబాద్ లోనే సొంతిల్లు కొనుక్కోవడం.. తన బ్రదర్ ను ఇక్కడకే పిలిపించేసుకుని వ్యాపారం స్టార్ట్ చేయడం లాంటివి చూస్తే.. స్టార్ హీరోయిన్ అయిపోయి వెలిగిపోయేవరకూ ఇక్కడి నుంచి కదిలే ఉద్దేశ్యం లేదేమో అనిపించక మానదు. అయితే.. బాలీవుడ్ ఆఫర్ల ముందు ఎలాంటి అట్రాక్షన్స్ అయినా అందాల భామలను.. అందులోనూ సినీతారలను అస్సలు ఏవీ ఆపలేవనే విషయం.. రకుల్ కారణంగా మరోసారి ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కు బాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. అంతే అమ్మడు తెగ ఎక్సైట్ అయిపోతోంది.

2014లో యారియా అంటూ బాలీవుడ్ లో నటించిన తర్వాత రకుల్ ఇప్పుడు మళ్లీ అయ్యారీ అనే మూవీ కోసం పిలుపు వచ్చింది. తన కంబ్యాక్ మూవీగా సిద్ధార్ధ మల్హోత్రా లాంటి హీరో.. నీరజ్ పాండే లాంటి డైరెక్టర్ తో కలిసి వర్క్ చేసే ఆఫర్ రావడం.. తెగ ఎగ్జైటింగ్ గా ఉందని అక్కడి మీడియా తెగ చెప్పేసుకుంటోంది రకుల్ ప్రీత్. ఇంతకీ ఇదే ఏడాది తమిళ్ జనాలను కూడా పలకరించనుంది రకుల్. మహేష్ బాబు స్పైడర్ తో పాటు.. కార్తితో ఓ సినిమా చేస్తోందీ భామ. మరి అక్కడకెళ్లి కూడా ఇవే మాటలను రిపీట్ వేస్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News