ఒక్క సక్సెస్ కొట్టగానే దానిని టాప్ గేర్ వేసుకుని తనవైపు తిరిగే అదృష్టంగా మలుచుకుంది రకుల్ ప్రీత్ సింగ్. అమ్మడు వెంకటాద్రి ఎక్సప్రెస్ తో దాదాపు సినిమాల్లోకి అడుగుపెట్టిన నాలుగేళ్లకు తొలి హిట్టు కొట్టి.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. చిన్న హీరోలతో స్టార్ట్ చేసి.. రామ్ చరణ్ - ఎన్టీఆర్ - మహేష్.. ఇలా వరుసపెట్టి పెద్ద స్టార్లతో వెండితెరపై రొమాన్స్ చేస్తోంది.
అయితే రకుల్ పాపకు ముందుచూపు కూడా చాలా ఎక్కువే. అందుకే తాను సంపాదించిన మొత్తాన్ని చాలా జాగ్రత్తగా అమ్మడు ఇన్వెస్ట్ చేస్తుంటుంది. కాస్త రియల్ ఎస్టేట్లో పెట్టేస్తే.. మరికాస్త సొమ్మును తన తమ్ముడితో కలసి ఎఫ్-45 అనే జిమ్ తాలూకు ఫ్రాంచైజీ తీసుకుంది రకుల్. గచ్చిబౌలిలో పెట్టిన ఈ జిమ్ చాలా బాగా నడుస్తుండటంతో.. ఇప్పుడు అమ్మడు ఇతర ఊళ్ళలో కూడా ఈ బిజినెస్ తనే ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై ఫోకస్ చేస్తోందట. ఆల్రెడీ బెంగుళూరు మరియు పూణెలలో కొందరు లోకల్ పార్టనర్లతో కలసి అమ్మడు జిమ్ బ్రాంచీలను ఓపెన్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు టాక్.
ఒక ప్రక్కన సినిమాల్లో భారీగానే పారితోషకం వెనకేస్తూ.. మరో ప్రక్కన తన ఆదాయాన్ని జాగ్రత్తగా ఇన్వెస్టు చేస్తూ.. అసలు వయస్సులో ఉన్నప్పుడు సంపాదించిన మొత్తాన్ని హీరోయిన్లు ఎలా ఇన్వెస్టు చేయాలి అనే కాన్సెప్టుపై రకుల్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా మారిపోయింది అనుకోండి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/