ర..కూల్..హాట్

Update: 2017-11-06 11:20 GMT
టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగినా కూడా అందరి హీరోలతో నటించే చాన్సు ఉండదు. ఎందుకంటే కొందరు హీరోయిన్స్ మన తెలుగులో ఉన్న టాప్ హీరోలకి అంతగా సెట్ కాలేరు. ఉదాహరణకి అనుష్క ను తీసుకుంటే అమ్మడు ఓ వర్గం స్టార్ హీరోలతో నటిస్తేనే బావుంటోంది. ఇకపోతే చాలా అరుదుగా దొరికే హీరోయిన్స్ మాత్రమే ఏ హీరోతో చేసినా కరెక్ట్ గా మ్యాచ్ అవుతోంది. అందులో  రకుల్ ప్రీత్ కూడా ఒకరు.

టాలీవుడ్ లో ఏ హీరోతో చేసినా అమ్మడి కెమిస్ట్రీ బాగా సెట్ అవుతోంది. సందీప్ కిషన్ నుంచి మహేష్ బాబు వరకు రొమాన్స్ పరంగా మార్కులు బాగానే కొట్టేసింది. ప్రస్తుతం తెలుగులో ఆఫర్స్ లేకపోయినా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేయడం మాత్రం మానట్లేదు. ఇక అసలు విషయానికి వస్తే రకుల్ రీసెంట్ మూవీ ఖాకి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాపై ఓ స్థాయిలో అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే సినిమాలోని ఒక పాటని కూడా చిత్ర యూనిట్ రీసెంట్ గా విడుదల చేసింది. రకుల్ తెలుగులో మొదటి సినిమా వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో మెల్ల మెల్లగా అనే సాంగ్ లో రొమాన్స్ ఏ స్థాయిలో చేసిందో తెలిసిందే. ఇక అంతకంటే ఎక్కువగా ధృవ లో పరేశానురా.. అనే పాటలో కూడా పరువాలను బాగానే ప్రజెంట్ చేసింది.

ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో కొంచెం ఘాటుగా తొలి వయసే అంటూ ఖాకి సినిమాలో సెక్సీగా కనిపిస్తోంది. ఈ ఒక్క పాటతో రకుల్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేలా ఉంది. కార్తితో రొమాన్స్ చేయడం చూస్తుంటే ఫుల్ సాంగ్ చూసేయ్యాలి అని రకుల్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతోంది. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Full View
Tags:    

Similar News