మన్మథుడు 2 తర్వాత మరొకటి సైన్ చేసిందే!

Update: 2019-04-22 03:59 GMT
బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ మొదట తన కెరీర్ ను చిన్న సినిమాలతోనే మొదలుపెట్టింది.  కానీ అతితక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి చరణ్.. ఎన్టీఆర్.. మహేష్ లాంటి టాప్ హీరోల సినిమాల్లో నటించింది.  మొదట్లో హిట్స్ పలకరించాయి కానీ తర్వాత  ఆమె నటించిన క్రేజీ సినిమాలు ఫ్లాప్ అవ్వడం.. ఇతరభాషల చిత్రాలపై ఫోకస్ చేయడంతో టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్లు తగ్గిపోయాయి.

ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'మన్మథుడు 2' లో హీరోయిన్ గా నటిస్తోంది. 28 ఎనిమిదేళ్ళ వయసులో 59 ఏళ్ళ సీనియర్ స్టార్ తో జోడీ కట్టడం అనే విషయం పక్కన పెడితే మాత్రం ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్టే.  ఈ సినిమా తర్వాత రకుల్ మరో ఇంట్రెస్టింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.  నితిన్ ఈమధ్యే తన పుట్టిన రోజు నాడు మూడు ప్రాజెక్టులను ప్రకటించాడు.  వాటిలో టాలెంటెడ్ ఫిలిం మేకర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నటించే సినిమా ఒకటి.  ఈ సినిమాలోనే రకుల్ కు హీరోయిన్ ఆఫర్ వచ్చింది.

 చంద్రశేఖర్ యేలేటి సినిమాలలో హీరోయిన్ ను గ్లామర్ డాల్ లాగా చూపించడం కంటే వ్యక్తిత్వం ఉండి.. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో చూపిస్తాడు.  ఇప్పటివరకూ గ్లామర్ పాత్రలపై ఎక్కువగా ఆధారపడ్డ రకుల్ ప్రేక్షకులను తన నటనతో మెప్పించేందుకు ఇది మంచి అవకాశం. గ్లామర్ తో పాటుగా నటన కూడా ఉంటేనే ఒక హీరోయిన్ కెరీర్ ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉంటుంది.  ఈ కోణంలో ఆలోచిస్తే మాత్రంన రకుల్ కు నితిన్ - యేలేటి సినిమా ఒక మంచి ఆఫర్ అని అనుకోవచ్చు.
Tags:    

Similar News