అడిగారని అన్నిటికీ ఒప్పుకోలేం కదా

Update: 2016-02-05 11:30 GMT
పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీయెస్ట్ యంగ్ హీరోయిన్. మొదట్లో లక్కీ హ్యాండ్ అనే పేరు సంపాదించుకుని.. తర్వాత వరుసగా కిక్ 2 - బ్రూస్ లీ ఫ్లాప్ లతో వెనకబడింది. కానీ నాన్నకు ప్రేమతో బ్లాక్ బస్టర్ అవడంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యి.. డిమాండ్ పెంచేసుకుంది. ఈ మధ్య రకుల్ కొన్ని ప్రాజెక్టులకు నో చెప్పడం హాట్ టాపిక్ అయింది.

మీరు ఆ సినిమా చేయను అన్నారటగా అని అడిగితే.. ఈ బ్యూటీ చాలా తెలివిగా సమాధానం చెప్పింది. 'అన్ని సినిమాలు చేయాలని నాకు కూడా ఉంటుంది. ప్రతీ మూవీలోను నా పాత్రకు ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయినా సరే అన్నింటినీ నేను చేయలేను కదా. హీరో - నా రోల్ - స్టోరీ - డైరెక్టర్.. ఇలా ఏదో ఓ పాయింట్ దగ్గర కమిట్ మెంట్ ఇచ్చేస్తుంటాను. అయినా నాకున్నవి 365 రోజులే. ఈ టైంలో అన్ని ఆఫర్లను ఒప్పేసుకోలేను. నేను ఏదైనా సినిమా చేయడం కుదరదని చెప్పానంటే.. సరైన కారణమే ఉంటుంది' అంటోంది సరైనోడి బ్యూటీ.

ప్రస్తుతం సరైనోడు చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్.. త్వరలో నితిన్ తో ఓ మూవీ చేయనుంది. కానీ సందీప్ కిషన్ కి మాత్రం నో చెప్పేయడంతోనే ఈ వివరణకు అసలు కారణం. ఎందుకంటే.. సందీప్, రకుల్ లు మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి ఒకే సినిమాతో అరంగేట్రం చేశారు. అయినా సరే చిన్న హీరో అనే కారణంతో సందీప్ కిషన్ కి నో చెప్పేసి, నితిన్ తో సై అనేసింది రకుల్ ప్రీత్ సింగ్.
Tags:    

Similar News