పట్టుకోండి చూద్దాం అంటున్న రకుల్

Update: 2016-02-13 07:19 GMT
పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోయిన్. గ్లామర్ అవతారంతోపాటు.. యాక్టింగ్ - డ్యాన్స్ స్కిల్స్ - పర్ ఫెక్ట్ జిమ్ బాడీ - అన్నిటికీ మించి తెలుగు పట్ల ఉన్న కమిట్ మెంట్.. ఈ కుర్ర హీరోయిన్ కి డిమాండ్ పెంచేశాయి. అయితే.. సినిమాల్లో గ్లామర్ ఒకెత్తు అయితే.. మేగజైన్ లలో ఒలకబోసే హొయలు మరొక ఎత్తు. ఇంతకుముందంటే మేగజైన్ ఫోటో షూట్స్ లో ఎక్కువగా మోడల్స్ కనిపించేవారు కానీ.. ఇప్పుడు రెండు ఫ్యాషన్ ఇండస్ట్రీలు బాగా మిక్సింగ్ అయిపోయాయి.

అంతకు మించి అన్న టైపులో.. సినిమాలకు మించి మేగజైన్ ల కోసం సొగసులు ధారపోస్తున్నారు హీరోయిన్లు. ఇక ప్రత్యేకించి ఫ్యాషన్ మేగజైన్ - అందులోనూ కవర్ పేజ్ స్టోరీ అంటే.. దీనికి తమ శక్తినంతా ధారపోసేసి మరీ అందాలు చిందించడం ఆనవాయితీ. దీన్ని ఏ మాత్రం తప్పకుండా.. తనమీద ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరుత్సాహపరచకుండా.. వీలైనంత మనోహరంగా తన అందాలను పరిచింది రకుల్ ప్రీత్ సింగ్. జేఎఫ్ డబ్ల్యూ మేగజైన్ ఫిబ్రవరి ఎడిషన్ కవర్ పేజ్ పై ఎక్కిన రకుల్.. తన ఆనందాన్ని ట్విట్టర్ సాక్షిగా పంచుకుంది.  ' క్యాచ్ మీ ఆన్ ఫిబ్రవరి జేఎఫ్ డబ్ల్యూ ఎడిషన్' అంటూ ట్వీట్ చేసి, కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేసింది రకుల్.

మరి రకుల్ అందాలు ఆరేసిన మేగజైన్ ను చేతులతో పట్టుకుని చదివేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. ఏమాటకు ఆమాటే చెప్పుకోవాలి.. రోజు రోజుకీ రకుల్ ఇంత అందంగా ఎలా తయారవుతోందబ్బా.!
Tags:    

Similar News