రకుల్‌ రగిలిపోతోందా?!

Update: 2015-06-26 03:38 GMT
కథానాయికలంతా డేట్స్‌ అడ్జస్ట్‌ అవ్వడం లేదు మొర్రో అని వాపోతుంటారు. కానీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ మాత్రం ఎన్ని సినిమాలతో బిజీగా      ఉన్నప్పటికీ డేట్స్‌ సమస్య రానివ్వడం లేదు. ఎలా ప్లాన్‌ చేసుకొంటుందా అని తోటి  కథానాయికలు సైతం ఆశ్చర్యపోతుంటారు. రకుల్‌ మాత్రం తాను సొంతానికి ఒక్క రోజుని కూడా కేటాయించుకోకుండా కష్టపడుతున్నా అని చెబుతుంటుంది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లాంటి కథానాయకుల సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఎలాగైనా మహేష్‌ సినిమాని చేజిక్కించుకోవాలని చూసింది రకుల్‌. అందుకోసమని వేరే ఏ సినిమాని ఒప్పుకోకుండా ఎదురు చూసింది.

     డేట్లు ఎంత ఇబ్బందయినా మహేష్‌ సినిమా కోసం డేట్లు సర్దుబాటు చేయాలని, తనకు తాను మరో స్టెప్‌ ఎదగాలని ప్లాన్‌ చేసుకొంది. కానీ రకరకాల కారణాలవల్ల ఆ సినిమా సమంత చేతికి వెళ్లింది. దీంతో రకుల్‌ కాస్త నిరుత్సాహానికి గురవడంతో పాటు, క్రేజీ కాంబినేషన్‌ సినిమా పోయిందేంటా అని  కాస్త ఆగ్రహంతో రగిలిపోతున్నట్టు సమాచారం. వెంటనే తేరుకొని మళ్లీ తనదైన శైలిలో దూసుకెళ్లాలని ఆమె నిర్ణయించుకొన్నట్టు తెలుస్తోంది. ''ఇక చూడండి. మళ్లీ క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు ప్రకటిస్తా''నని ఆమె తన సన్నిహితులకు చెబుతోందట. అలా అన్నదో లేదో అల్లు అర్జున్‌ సరసన రకుల్‌ అంటూ ప్రచారం బయటికొచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగే కథానాయిక అని ఫిల్మ్‌నగర్‌ జనాలు మాట్లాడుకొంటున్నారు. మొన్నటికి మొన్న ఈ చిత్రంలో హన్సిక నటిస్తోందంటూ ప్రచారం సాగింది. మరి అసలు కథానాయిక ఎవరన్నది త్వరలోనే తేలిపోనుంది.

Tags:    

Similar News