ఫోటో స్టోరీ : కొంగ కాళ్ల శ్రీ‌దేవి

Update: 2018-08-17 08:15 GMT

మోడ‌లింగ్‌ లో ఉన్న రోజుల్లోనే ర‌కుల్ త‌న అందచందాల్ని ఆ రంగానికి అంకిత‌మిచ్చింది. బికినీ షూట్ - స్విమ్ సూట్ అంటూ త‌న‌కు ప‌రిచ‌యం కాని ఫ్యాష‌న్ అన్న‌దే లేదు. అందాల పోటీల్లో అన్ని కోణాల్లోనూ త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్న ఫోటోలు ఇప్ప‌టికీ వెబ్‌లో వేడి పెంచుతూనే ఉన్నాయ్‌. ఆర‌డుగుల ఈ అంద‌గ‌త్తె పొడుగుకాళ్ల సుంద‌రి శిల్పాశెట్టికి వేలువిడిచిన మేన‌త్త కూతురిలా క‌నిపించేది. జ‌న్మ‌తః పంజాబి జీన్స్ కాబ‌ట్టి ఆ అందం చందం కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుట్టించేది. అందుకే `ధ్రువ` చిత్రంలో ప‌రేషాను అయ్యానురా! అంటూ ర‌కుల్ హొయ‌లు పోయిన తీరుకు యూత్ మ‌తిచెడి ఏదో అయ్యారు. అంత‌కుమించి.. ఇటీవ‌లే మ్యాగ్జిమ్ క‌వ‌ర్‌ షూట్‌ తో మ‌తిచెడే అందాల్ని ఆరాంగా ఎలివేట్ చేసింది ర‌కుల్ ప్రీత్‌.

మ్యాగ్జిమ్‌ ఫోటోషూట్‌ లో ర‌కుల్ లుక్ చూసి యూత్ స్పెల్‌ బౌండ్ అయిపోయారంటే అతిశ‌యోక్తి కాదు. అయితే అప్ప‌ట్లో అన్ని ఫోటోల్ని బ‌య‌ట‌కు రివీల్ చేయ‌లేద‌ని - వాటిలో కొన్నిటిని దాచిపెట్టామ‌ని చెబుతూ తాజాగా ఓ ఫోటోని రివీల్ చేసింది ర‌కుల్‌. ఈ ఫోటోలో త‌న పొడుగు కాళ్ల అందాన్ని ప్ర‌ద‌ర్శించింది. కిల్లింగ్ లుక్స్‌ తో దేహ‌శిరుల్ని అతుక్కుపోయిన బ‌బుల్ బికినీలో క‌నిపించిన ర‌కుల్ ఎంతందంగా క‌నిపించిందో - అంత‌కుమించి ఆ పొడ‌వాటి కాళ్ల‌పైనే కెమెరా ఫోక‌స్ ప‌డ‌డం చూస్తుంటే ఆ కొంగ కాళ్లం అందం వ‌ర్ణించ‌న‌ల‌వి కాదు.

ఎన్టీఆర్ బ‌యోపిక్‌ లో శ్రీ‌దేవి పాత్ర‌లో న‌టిస్తోంది కాబ‌ట్టి ``కొంగ కాళ్ల శ్రీ‌దేవి`` అని పొగిడేయాలేమో?!.. అన్న‌ట్టు ఈ చిత్రంలో మోక్ష‌జ్ఞ నూనూగు మీసాల తార‌క‌రామునిగా క‌నిపిస్తున్నాడు కాబ‌ట్టి, ఇంత పొడ‌వైన ర‌కుల్ ప‌క్క‌న అత‌డు ఎలా క‌నిపిస్తాడో చూడాల‌న్న ఆత్రం నంద‌మూరి అభిమానుల్లో ఉంది. ఇంత‌కీ ఈ కొంగ‌కాళ్ల శ్రీ‌దేవితో రొమాన్స్ అద‌ర‌గొడ‌తాడంటారా? అస‌లు ఇంత‌వ‌ర‌కూ మోక్షు గురించి చిత్ర‌యూనిట్ చిన్న క్లూ కూడా ఇవ్వ‌లేదాయే!!
Tags:    

Similar News