రకుల్‌తో లిప్‌లాక్‌ కావాలంటే...

Update: 2015-03-18 13:30 GMT
టాలీవుడ్‌లో ఒప్పుకున్న తొలి సినిమాలోనే హీరోకు పెదవి అందించేసింది రకుల్‌ ప్రీత్‌. అనుకోని కారణాల వల్ల ఆలస్యంగా, గత ఏడాది విడుదలైన 'రఫ్‌'లో ఆదితో లిప్‌లాక్‌ చేసిన సంగతి తెలిసిందే. ఐతే కెరీర్‌ మొదట్లో కాబట్టి లిప్‌ లాక్‌ చేసిందనుకోవడానికేమీ లేదు. ఇప్పుడు కూడా లిప్‌లాక్‌కు తాను రెడీ అని.. అది పెద్ద విషయమే కాదని అన్నట్లు మాట్లాడుతోంది ఢిల్లీ భామ.

''లిప్‌ లాక్‌లు సినిమాలో ఓ భాగమే. వాటికి ప్రత్యేకత ఆపాదించి చూడటం అనవసరం అని నా అభిప్రాయం. కథలో భాగంగా లిప్‌లాక్‌లు ఉంటే అవి చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఐతే ఆ సన్నివేశాలు వల్గర్‌గా ఉండకూడదు. క్రియేటివ్‌గా ఉండాలి. సన్నివేశానికి అవి అవసరం అనిపించాలి. అంతే కానీ కథకు అవసరం లేకపోయినా ప్రచారం కోసమో, సినిమాకు క్రేజ్‌ తీసుకురావడానికో కొన్ని సినిమాల్లో లిప్‌లాక్‌లు పెడుతున్నారు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాంటి వాటిలో నటించడానికి నేను కూడా ఒప్పుకోను'' అంటోంది రకుల్‌. దీన్ని బట్టి రకుల్‌తో లిప్‌లాక్‌ చేయించాలంటే ఏం చేయాలో దర్శకులకు అర్థమయ్యే ఉంటుంది. లిప్‌లాక్‌ కథలో భాగం అని రకుల్‌కు నమ్మకం కలిగిస్తే చాలు. పెదవి ముద్దుకు ఆమె రెడీ.

Tags:    

Similar News