హీరోయిన్ల ఆఫర్లన్నీ బెల్లంకొండ బాబుకే

Update: 2018-06-11 10:30 GMT
టాలీవుడ్ లో బెల్లంకొండ శ్రీనివాస్ నిజంగానే ఓ సెన్సేషన్. కొత్త కుర్రాడు అయినా.. టాప్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. భారీ బడ్జెట్ల కారణంగా ఇప్పటివరకూ హిట్ అనిపించుకునే సినిమా పడలేదు కానీ.. ఈ హీరో జోరు మాత్రం తగ్గలేదు.

ఇప్పుడు కూడా పూజా హెగ్డే లాంటి క్రేజీ భామతోనే మూవీ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇప్పటికే సమంత.. తమన్నా.. రకుల్ ప్రీత్ సింగ్ వంటి టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేసేశాడు. అయితే.. కొత్త హీరో అయినా ఇతడితో చేసేందుకు ఆ రేంజ్ ఉన్న హీరోయిన్స్ ఒప్పుకోవడానికి అసలు కారణం.. రెమ్యూనరేషన్ అనే విషయం చెప్పుకోవాల్సిందే. సాధారణంగా వారు తీసుకునే పారితోషికం కంటే.. 2 నుంచి 3 రెట్లు పుచ్చుకుని మరీ బెల్లంకొండ సినిమాల్లో నటిస్తున్నారు ఈ భామలు.

అలాగని డబ్బులు భారీగా ఆఫర్ చేసినంత మాత్రాన.. ఎవరితో పడితే వారితో చేసేందుకు అంగీకరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రీసెంట్ గా ఓ మినిస్టర్ తన కొడుకును హీరో చేసేందుకు ప్రయత్నించి.. రకుల్ ను అడిగారట. ఏకంగా 3 కోట్ల పారితోషికం ఇస్తామని.. అది కూడా సింగిల్ పేమెంట్ తో సెటిల్ చేస్తామని ఆఫర్  చేశారట. అయినా సరే.. ఏ మాత్రం తొణకని రకుల్ ప్రీత్.. ఆ మినిస్టర్ కొడుకు పక్కన నటించనని తేల్చేసిందట. ఇలాంటి ఆఫర్లను తిరస్కరిస్తున్న క్రేజీ హీరోయిన్స్ బాగానే ఉంటోంది. మరి వీరంతా బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన చేయడానికి కారణం.. బహుశా అతని తండ్రి బడా ప్రొడ్యూసర్ కావడమే అనే టాక్ వినిపిస్తోంది.
Tags:    

Similar News