ఆ రకుల్‌ ఎపిసోడ్‌ ను వదిలేయొచ్చుగా

Update: 2016-02-15 05:04 GMT
యాక్చువల్‌ గా చాలా కాలం క్రితం.. ''మిష్టర్‌ ఫర్ ఫెక్ట్‌'' సినిమాలో తాప్సీ రోల్ కోసం రెండు రోజులు షూట్‌ చేసి పక్కకు తప్పుకుందనే విషయం చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న రూమర్‌ ఏంటంటే.. ప్రభాస్‌ తన స్నేహితులతో కలసి మొదలు పెట్టిన యువి క్రియేషన్స్‌ బ్యానర్‌ లో నటించమని అడుగుతుంటే.. అమ్మడు ఏకంగా ఆకాశాన్ని తాకే రేట్లు చెబుతోందని.

నిజానికి వరుసగా కిక్‌ 2 - బ్రూస్‌ లీ సినిమాలు బాల్చీ తన్నేయగానే రకుల్‌ చాలా ఫీలైంది. ఆ తరువాత నాన్నకు ప్రేమతో హిట్టవ్వగానే అమ్మడు ఫుల్‌ హ్యీపీగా ఫీలైంది. ఇక త్వరలో సరైనోడు సినిమాతో రానుంది. తని ఒరువన్‌ సినిమాలో కూడా తనే హీరోయిన్‌. కామన్‌ గా ఇన్నేసి పెద్ద సినిమాలు.. ఇన్ని హిట్లు ఉన్న నాయికలు ఎవరైనా కూడా ఒక కోటి అడగటం కామనే. అలాంటప్పుడు యువి క్రియేషన్స్‌ అయితే ఏంటి.. గీతా ఆర్ట్స్‌ అయితే ఏంటి.. దిల్‌ రాజు సినిమా అయితే ఏంటి.. ఛార్జ్‌ అలాగే ఉంటుంది. అసలు మిష్టర్‌ పర్ఫెక్ట్‌ ను దృష్టిలో పెట్టుకొని రకుల్‌ ను ఇలా రఫ్పాడించడం బాలేదంటున్నారు ఆమె అభిమానులు.

ఇకపోతే ఇదే విషయంపై రకుల్‌ మాట్లాడుతూ.. ''అసలు నేను రేటు పెంచిందే లేదు. డబ్బులు గురించి మరీ అంత కక్కూర్తి పడే దానినే కాదు. నాపై ఉత్తినే రూమర్లు స్ప్రెడ్‌ చేయకండి ప్లీజ్‌'' అంటూ చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News