వరుసగా తెలుగు క్రేజీ ప్రాజెక్టుల్లో చోటు దక్కించుకుంటున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. త్వరలో థియేటర్ల లో సందడి చేయనున్న కిక్2 లో ఆడిపాడింది రకుల్. ఇదే కాదు ఎన్టీఆర్, రామ్ చరణ్ లతోనూ జోడీ కడుతోంది. అమ్మడు నటించే సినిమాల్లో ఎక్కువగా కమర్షియల్ మూవీసే ఉంటున్నాయి. దానికి కారణం నేను కాదు.. నాకొస్తున్న ఆఫర్స్ అవే కాబట్టి... వాటిలోంచే ఎంచుకుంటున్నా అని చెబ్తోంది.
కంగన రనౌత్ చేసిన క్వీన్ లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని ఉన్నా.. ఆ ఛాన్స్ ఇప్పటివరకూ తనకు రాలేదంటోంది రకుల్ ప్రీత్. ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు తనకేం అభ్యంతరం లేదని, నాపై ఆ నమ్మకం డైరెక్టర్ల కు, ప్రొడ్యూసర్లు ఉండాలిగా అంటోందీ చిన్నది. అయినా అలాంటి ఆఫర్స్ వచ్చేది జీవితంలో ఒకసారే అని... వాటికోసం ఎదురుచూస్తూ, లైఫ్ అంతా గడిపేయలేం కదా అంటూ... జీవితసత్యాలు కూడా బోధించేస్తోందీ కుర్ర హీరోయిన్.
కథానాయికగా ఎక్కువకాలం కొనసాగాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుందన్న రకుల్... ఇప్పుడు పరిశ్రమలో తనకు దక్కిన గుర్తింపుపై సంతృప్తిగానే ఉన్నానంటోంది. ఒక సినిమాతోనో, ఒక పాత్రతోనో ఈ స్థాయి దక్కలేదన్న వాస్తవం తనకు తెలుసనీ... ఒక్కో అడుగూ వేస్తేనే ప్రయాణం పూర్తవుతుందని అంటోంది. హీరోయిన్ గా సుదీర్ఘకాలం నిలబడాలంటే ఎంత కష్టపడాలో.. ఇప్పటివరకూ చేసిన ప్రయాణంలో తెలుసుకున్నానని అంటోంది. రకుల్ మాటలు వింటుంటే... స్టార్ హీరోయిన్ గా ఎదిగే టైం లో ఇన్ని నేర్చేసుకుంటే... తర్వాత ఇంకెన్ని నేర్చుకుంటుందో, లేక నేర్పిస్తుందో అనిపిస్తోంది.