`ఇస్మార్ట్ శంకర్`తో లాంగ్ గ్యాప్ తర్వాత సక్సెస్ ట్రాక్ ఎక్కిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. అదే జోరును కంటిన్యూ చేయాలని చూశాడు. కానీ, అలా జరగడం లేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ అనంతరం `రెడ్` అనే మూవీతో వచ్చాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. రీసెంట్ గా రామ్ `ది వారియర్`తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ మూవీని తమిళ దర్శకుడు అయిన ఎన్. లింగుసామి తెరకెక్కించాడు. ఇందులో బ్రేకుల్లేని హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తే.. టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి విలన్ గా చేశాడు. అలాగే రామ్ తన కెరీర్ లోనే తొలిసారి పోలీస్ ఆఫీసర్ గా చేసిన సినిమా ఇది. దీనిని తెలుగుతో పాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందించారు.
అయితే ఎన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ.. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. వీకెండ్ వరకు మంచి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. ఆ తర్వాత మౌత్ టాక్ వల్ల బాగా వీక్ అయిపోయింది.
ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో రామ్ ఒకమాట అన్నాడు. `గతంలో నాలుగైదు పోలీస్ కథలు విన్నాను. అన్నీ రొటీన్ అనిపించాయి. ఇక పోలీస్ కథలు చేయకూడదనుకున్నా. ది వారియర్ కథ చెప్పే ముందు పోలీస్ కథ అని తెలిసింది. ఫార్మాలిటీ కోసం వినేసి ఆ తర్వాత వద్దని చెప్పాలనుకున్నా. కానీ, కథ విన్నాక నో చెప్పలేకపోయా` అని పేర్కొన్నాడు.
ఇక్కడ ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. రామ్ రిజెక్ట్ చేసిన పోలీస్ కథల్లో ఓ హిట్ మూవీ కూడా ఉందట. ఆ మూవీ మరెదో కాదు.. `క్రాక్`. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీతోనే మాస్ మహారాజ్ రవితేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అయితే `క్రాక్` కథ మొదట రామ్ వద్దకే వెళ్లిందట. డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఇంతకు ముందు రామ్ తో `పండగ చేస్కో` మూవీ చేశాడు.
ఆ సన్నిహిత్యంతోనే `క్రాక్` కథను రామ్ కు వినిపించాడట. కానీ, ఆయన సున్నితంగా ఈ మూవీని రిజెక్ట్ చేయడంతో.. `క్రాక్` చేసే అద్భుత అవకాశం రవితేజకి దక్కిందని అంటున్నారు. దీంతో అప్పుడు `క్రాక్` ను వద్దనుకుని, ఇప్పుడు `ది వారియర్`ను కావాలనుకుని రామ్ పెద్ద తప్పే చేశాడని పలువురు సినీ ప్రియులు భావిస్తున్నారు.